ఫ్యాన్స్ కోసమే నటిస్తున్నా.. లేదంటే!
ప్రస్తుతం ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా చేయగా, అందులో టాలీవుడ్ హీరో నాగార్జున కీలక పాత్రలో నటించాడు.
By: Tupaki Desk | 19 Jun 2025 8:00 AM ISTసినీ ఇండస్ట్రీలో హీరోగా, డైరెక్టర్ గా, నిర్మాతగా, సింగర్ గా, లిరిక్ రైటర్ గా ఎన్నో పాత్రలు పోషిస్తూ తన ప్రత్యేకతను చాటి మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా ధనుష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా చేయగా, అందులో టాలీవుడ్ హీరో నాగార్జున కీలక పాత్రలో నటించాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, ఆ ఈవెంట్ లో ధనుష్ తన స్పీచ్ లో భాగంగా పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. తనకు కెమెరా ముందు నటుడిగా ఉండటం కంటే, కెమెరా వెనుక డైరెక్టర్ గా ఉండటమే ఎక్కువ ఇష్టమని, యాక్టర్, డైరెక్టర్ రెండింటి మధ్యలో నిలబెట్టి ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే తాను కచ్ఛితంగా డైరెక్షన్‌నే సెలెక్ట్ చేసుకుంటానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు ధనుష్.
అభిమానుల కోసమే తాను హీరోగా కంటిన్యూ అవుతున్నానని, వారి కోసమే నటుడిగా ఉండాలనుకుంటున్నానని, తన సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారని, అందుకే హీరోగా సినిమాలు చేస్తున్నానని, లేదంటే ఎప్పుడో యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పెట్టి పూర్తి స్థాయిలో డైరెక్టర్ గా మారిపోయేవాడినని ధనుష్ చెప్పాడు. ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదే ఈవెంట్ లో ఫ్యాన్స్ ను ఉద్దేశించి కూడా ధనుష్ మాట్లాడాడు. లైఫ్ లో ఎవరినీ ఫాలో అవొద్దని, మనకంటూ మనం ఓ స్పెషల్ దారిని ఏర్పాటు చేసుకుని అందులో సక్సెస్ అవాలని సూచించారు. తాను కూడా ఒకరు వేసిన బాటలో నడవలేదని, వచ్చిన ఛాన్సులను అందుకుంటూ కష్టపడి ఇండస్ట్రీలో తనకంటూ సొంత దారిని నిర్మించుకుని అందులోనే గుర్తింపు తెచ్చుకున్నానని ధనుష్ అన్నారు.
