కథ చెప్పే ముందు ఆయనెవరో కూడా తెలియదు
అయితే ఇన్నాళ్లూ తన సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్న శేఖర్ ఇప్పుడు కుబేరతో రూటు మార్చాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
By: Tupaki Desk | 18 Jun 2025 5:00 PM ISTటాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల ఒకరు. చాలా సాధారణ వ్యక్తిలా కనిపించే శేఖర్ కమ్ముల విజన్‌కు, ఆయన తీసిన సినిమాలకు ఎంతో మంది అభిమానులున్నారు. ఇప్పటికే ఆయన ఆనంద్, గోదావరి, ఫిదా, లాంటి క్లాసిక్ సినిమాలను తీశారు. అయితే ఇన్నాళ్లూ తన సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్న శేఖర్ ఇప్పుడు కుబేరతో రూటు మార్చాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఇప్పటివరకు కమ్ముల తన కెరీర్లో చేయని కొత్త జానర్ ను కుబేర కోసం ట్రై చేస్తున్నాడు. ధనుష్ హీరోగా నాగార్జున కీలక పాత్రలో రష్మిక మందన్నా హీరోయిన్ గా శేఖర్ కమ్ముల చేసిన కుబేర సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది. అయితే టాలీవుడ్ లో గొప్ప అభిరుచి ఉన్న డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల గురించి ధనుష్ కు గతంలో ఏమీ తెలియదట.
కుబేర కథ విన్నప్పుడు కూడా శేఖర్ గురించి తనకేమీ తెలియదని, కథ నచ్చి, ఓకే చేసిన తర్వాతే శేఖర్ గురించి వేరే వాళ్లను అడిగి తెలుసుకున్నానని, ఆ తర్వాతే ఆయన తీసిన సినిమాలు చూసి, ఆయన గొప్పతనం తెలుసుకున్నానని చెన్నైలో జరిగిన కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్వయంగా ధనుష్ వెల్లడించాడు. కరోనా టైమ్ లో వీడియో కాల్ లో 20 నిమిషాల పాటూ శేఖర్ కమ్ముల తనకు కథ చెప్పారని ధనుష్ అన్నాడు.
కథ నచ్చి ఓకే చెప్పిన తర్వాత రెండేళ్ల పాటూ ఆయన కనిపించలేదని, ఆ రెండేళ్లు ఆయన కథపై వర్క్ చేస్తూనే ఉన్నారని, ఆఖరికి ఫైనల్ స్క్రిప్టుని ఎంతో అద్భుతంగా రెడీ చేసుకుని వచ్చారని, ఫుల్ నెరేషన్ విన్న తర్వాత ఇది చాలా భారీ స్కేల్ ఉన్న సినిమా అనుకుని ఎంతో ఊహించుకుని షూటింగ్ కు వెళ్తే, తిరుపతిలో నడి రోడ్డు మీద ఎండలో నిలబెట్టి అమ్మా అని అడుక్కునేలా చేశారని తన క్యారెక్టర్ గురించి సరదాగా మాట్లాడాడు ధనుష్. కుబేర కచ్ఛితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తనకుందని, తనను నమ్మి సినిమా చూడాల్సిందిగా ఆడియన్స్ ను కోరాడు ధనుష్.
