కుబేర 'పోయిరా మామా' - ధనుష్ మాస్ బీట్!
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేరా. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది.
By: Tupaki Desk | 20 April 2025 12:52 PM ISTధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కుబేరా. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రొమోషన్స్ షురూ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ "పోయిరా మామా"ను విడుదల చేశారు.
ఈ పాట విడుదలైన దగ్గర నుంచే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మాస్ బీట్ పాటలో, ధనుష్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదివరకే ధనుష్ పాడిన పాటలు సినిమాలకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈసారి కూడా కుబేర సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యేలా ఒక సాంగ్ పాడడం విశేషం. పాట ఓసారి విన్నా, వెంటనే రిపీట్ మోడ్ లోకి వెళ్లిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
భాస్కరభట్ల రాసిన సాహిత్యం ఊర మాస్ ఫీల్ ను అందిస్తుంది. "పోయిరా మామా.." అంటూ సాగే ఈ పాటలో హై ఎనర్జీ ట్యూన్, తీన్మార్ బీట్ వినిపించగా.. ధనుష్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. శేఖర్ కమ్ముల తరహాలో వస్తోన్న సినిమా నుంచి ఇలాంటి మాస్ సాంగ్ రావడం అనుకోకుండా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా చేసింది. ఇక VJ శేఖర్ మాస్టర్ ఈ పాటకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు.
పాట విడుదలైన తరువాత దేవీ శ్రీ ప్రసాద్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ మీదే స్పెషల్ క్రేజ్ పెరిగింది. క్లాస్ టేస్ట్ ఉన్న దర్శకుడికి మాస్ టెంపో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తో కలిస్తే ఎలా ఉంటుందో అనుకున్నవారికి "పోయిరా మామా" పాట కిక్కిస్తోంది. సినిమాపై ఇప్పటి వరకు ఉన్న హైప్ కు ఈ పాట మరో లెవెల్ హైప్ ను జత చేసింది. ఈ సినిమాలో ధనుష్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్టు సమాచారం.
పాటలో కనిపించిన విజువల్స్, బాడీ లాంగ్వేజ్, ధనుష్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే సినిమాలో ఆయన మరోసారి తన టాలెంట్‌ను చూపించనున్నారని అర్థమవుతోంది. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నాగార్జున డిఫరెంట్ అండ్ పవర్ఫుల్ పాత్రలో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. ఇక పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్లే అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ కు మంచి స్పందన రావడంతో.. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ "పోయిరా మామా" తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక జూన్ 20న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
