ధనుష్ చెప్పిన లైఫ్ ఫిలాసఫీ ఇదే!
ఇదిలా ఉంటే ఈ ఏడాది తెలుగులో ధనుష్ చేసిన `కుబేర` జూన్ 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
By: Tupaki Desk | 17 Jun 2025 12:17 PM ISTగత ఏడాది `రాయన్`తో దర్శకుడిగా, హీరోగా బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని శభాష్ అనిపించుకున్న ధనుష్ ఈ ఏడాది కూడా దర్శకుడిగా మరో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. యంగ్ టీమ్‌తో ధనుష్ చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ 'జాబిలమ్మ నీకు అంత కోసమా'. ఓ పక్క హీరోగా, మరో పక్క దర్శకుడిగా తనదైన మార్కు విజయాలతో దూసుకుపోతున్న ధనుష్ ఈ ఏడాది మరో మూవీ `ఇడ్లీ కడై`తోనూ డైరెక్టర్‌గా తన సత్తా చాటుకోబోతున్నాడు. దీనికి ప్రొడ్యూసర్ కూడా తనే.
ఇదిలా ఉంటే ఈ ఏడాది తెలుగులో ధనుష్ చేసిన 'కుబేర' జూన్ 20న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. శేఖర్ కమ్ముల సినిమాలంటే ప్రేక్షకులు ప్రత్యేకంగా చూస్తారు. అలాంటి డైరెక్టర్‌కు ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న తోడవ్వడంతో 'కుబేర'పై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే హీరో ధనుష్ చెప్పిన లైఫ్ ఫిలాసఫీ నెట్టింట వైరల్‌గా మారింది. మనిషి జీవితానికి, డబ్బుకు ఉన్న సంబంధాన్ని వివరిస్తూనే జీవిత సత్యాన్ని ధనుష్ వెల్లడించడం నెటిజన్‌లని విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతి ఒక్కరికీ ఫైనాన్సియల్ సమస్యలు ఉంటాయని, తానూ అలాంటి సమస్యలని ఎదుర్కొన్నానని తెలిపారు. 'కుబేర' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్ చెప్పిన లైఫ్ ఫిలాసఫీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ ఆలోచింపజేస్తోంది.
`హోదాకు అడ్డు లేదు. అందరూ డబ్బుతో ఇబ్బంది పడుతున్నారు. మీరు రూ.150 సంపాదిస్తే.. మీకు రూ.200ల విలువైన సమస్యలుంటాయి. రూ. కోటి సంపాదిస్తే..వారికి రూ. 2 కోట్ల సమస్యలుంటాయి. ఇది ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్. ఇక్కడ డబ్బే ప్రదానం. అదే అన్నిటికీ ప్రధాన సమస్య.. ప్రధాన సొల్యూషన్` అని లైఫ్‌తో డబ్బుకున్న అనుబంధాన్ని, దాని ప్రాముఖ్యతను చెప్పి ధనుష్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
