Begin typing your search above and press return to search.

మరోసారి సెంచరీ కొట్టేసిన ధనుష్

ఇక ఇటీవల కాలంలో ధనుష్ నటించిన నాలుగు సినిమాలు వరుసగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం.

By:  Tupaki Desk   |   25 Jun 2025 6:57 PM IST
మరోసారి సెంచరీ కొట్టేసిన ధనుష్
X

మెల్లగా తన మార్కెట్‌ను బలోపేతం చేసుకుంటున్న తమిళ స్టార్‌ హీరో ధనుష్‌కు ‘కుబేర’ సినిమా మరో పెద్ద విజయాన్ని అంధించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, విడుదలైన తొలి రోజు నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. నాగార్జున, రష్మిక మందన్నా వంటి స్టార్ కాస్ట్, ధనుష్ ఆకట్టుకునే నటన కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.

లేటెస్ట్ గా ‘కుబేర’ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటి గణనీయమైన ఘనత సాధించిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది విడుదలైన 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషం. సినిమాపై ముందు నుంచి ఉన్న అంచనాలు, ధనుష్‌కు టాలీవుడ్‌లో ఏర్పడిన క్రేజ్‌ కారణంగా ఈ విజయాన్ని సాధించినట్టు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

‘కుబేర’ సినిమా ఒక ధనవంతుడు, ఒక పేదవాడు మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో రూపొందింది. ఇందులో ధనుష్ నటించిన దేవా పాత్రకి విశేషంగా స్పందన లభించింది. నాగార్జున నటించిన దీపక్ పాత్ర కూడా ఇంటెన్స్ గా ఉండటంతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంది. రష్మిక పాత్రకు మంచి సీట్ టైం ఉండగా, కథానాయికగా ఆమె కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించగా సినిమా ఎమోషన్‌కి బలాన్నిచ్చింది.

సుమారు 3 గంటల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం టెక్నికల్‌గా కూడా ప్రశంసలు అందుకుంది. నేపథ్య సంగీతం, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ధనుష్ నటనలో భిక్షగాడి యాంగిల్‌కి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ హైఎమోషనల్ కమర్షియల్ డ్రామా, టికెట్ల రేట్లు పెరిగినా కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకర్షించింది.

ఇక ఇటీవల కాలంలో ధనుష్ నటించిన నాలుగు సినిమాలు వరుసగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం.

తిరు

సార్

రాయన్

కుబేర

ఈ విజయాలతో ధనుష్‌ తెలుగులో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. ఇక ‘కుబేర’ వంటి హిట్‌తో ఆయనకు టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఎలాంటి విజయాలు అందుతాయో చూడాలి