Begin typing your search above and press return to search.

కుబేర.. మొదట్లో టెన్షన్ పెట్టినా..

తమిళనాట మిడ్‌రేంజ్ స్టార్‌గా స్థిరమైన ఫ్యాన్‌బేస్ ఉన్న ధనుష్ తాజా చిత్రం కుబేర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 12:24 PM IST
కుబేర.. మొదట్లో టెన్షన్ పెట్టినా..
X

తమిళనాట మిడ్‌రేంజ్ స్టార్‌గా స్థిరమైన ఫ్యాన్‌బేస్ ఉన్న ధనుష్ తాజా చిత్రం కుబేర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదట్లో ఒక ప్రయోగాత్మక సినిమాగా భావించినా, ఇప్పుడు ఈ సినిమా క్రేజ్ జెట్ స్పీడ్‌లో పెరిగిపోతోంది. తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకూ ఇది మంచి కాన్సెప్ట్ వేదికగా నిలుస్తోంది.

సినిమా రిలీజ్‌కు ముందు బజ్ అంతగా లేకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ధనుష్‌కి వంద కోట్ల మార్క్‌ క్రాస్ చేసిన సినిమాలున్నా, కుబేర విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో జరగలేదు. ఇందులో మాస్ అంశాలు తక్కువగా ఉండటం, ప్రోమోషనల్ కంటెంట్ పెద్దగా ఆకట్టుకోకపోవడం కూడా ప్రధాన కారణాలు. అయితే ఇదంతా రిలీజుకు ముందే. ధనుష్ మాత్రం మొదటి నుంచి సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ గానే ఉన్నాడు.

ఇక ఫైనల్ గా ఆ ధీమా నిజమైంది. మొదటి రోజు డిస్ట్రిబ్యూటర్స్ ను కాస్త టెన్షన్ పెట్టినప్పటి రిలీజైన ఈవీనింగ్ కి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మార్నింగ్ షోలు పూర్తయ్యేసరికి తమిళనాట మౌత్ టాక్ బలంగా పెరిగింది. మధ్యాహ్నం షోల నుంచే థియేటర్లు నిండిపోవడం మొదలైంది. సాయంత్రానికి తమిళనాడు మెయిన్ సిటీల్లో టికెట్లు దొరకడం కష్టమైపోయింది. రివ్యూలు, సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ చూస్తే.. ధనుష్ మరోసారి తన నటనతో అద్భుతాన్ని అందించాడని స్పష్టంగా తెలుస్తోంది. చాలా మంది అతని పెర్ఫార్మెన్స్‌కి జాతీయ అవార్డు వస్తే ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో భావోద్వేగాలు అద్భుతంగా ఉన్నాయని, ధనుష్ క్యారెక్టర్ డిజైన్ చాలా విభిన్నంగా ఉన్నదని తమిళ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. శేఖర్ ఎప్పుడూ హ్యూమన్ ఎమోషన్స్‌ని డీప్‌గా టచ్ చేసే దర్శకుడిగా గుర్తింపు అందుకున్నాడు. కుబేరలో కూడా అదే మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందని అక్కడి సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగులోనూ సినిమా పాజిటివ్ మౌత్ టాక్‌తో వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా అర్బన్ సెంటర్స్‌లో రాత్రి షోలకి మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. వీకెండ్ పూర్తయ్యేసరికి వసూళ్లు బాగా పెరిగే అవకాశముంది. శేఖర్ కమ్ముల స్టైల్‌లో కాన్సెప్ట్‌తో కూడిన కమర్షియల్ సినిమాలకి కూడా మార్కెట్ ఉందని కుబేర మరోసారి నిరూపిస్తోంది.

ఈ సినిమాతో ధనుష్ తన నటనలో మరో మార్క్ ని అధిగమించగా, శేఖర్ తన డైరెక్షన్ పంచ్‌తో తమిళ మార్కెట్‌లో గట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. టెక్నికల్ టీం నుంచి సంగీతం, విజువల్స్‌ వరకూ ప్రతీ డిపార్ట్‌మెంట్‌ టీమ్ విజయంలో భాగమయ్యింది. కుబేర క్రేజ్ చూస్తే ఇది ఓ లాంగ్‌రన్ సినిమా కాబోతుందన్న అభిప్రాయమే సినిమావర్గాల్లో వినిపిస్తోంది.