Begin typing your search above and press return to search.

'కుబేరా' - బుకింగ్స్ జోరు ఏ స్థాయిలో ఉందంటే..

2025 సెకండ్ హాఫ్ లో తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన 'కుబేరా' టాప్ లిస్ట్ లో ఉందని చెప్పవచ్చు

By:  Tupaki Desk   |   17 Jun 2025 2:12 PM
కుబేరా - బుకింగ్స్ జోరు ఏ స్థాయిలో ఉందంటే..
X

2025 సెకండ్ హాఫ్ లో తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన 'కుబేరా' టాప్ లిస్ట్ లో ఉందని చెప్పవచ్చు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా.. ప్రీ రిలీజ్ బజ్‌తో ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది. ఎమోషనల్ నెరేటివ్‌కు శేఖర్ కమ్ముల బ్రాండ్, నాగార్జున ధనుష్ రష్మిక మంధన్న లాంటి స్టార్స్ కాంబినేషన్.. దీనికి మరో లెవెల్ ఎనర్జీ కలిపింది.

ఇక లేటెస్ట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు పవర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. సింపుల్ కాన్సెప్ట్.. స్ట్రాంగ్ ఎమోషన్ అనే శేఖర్ ట్రేడ్‌మార్క్‌ను ఈ ట్రైలర్ మరోసారి రిపీట్ చేయగా, సినిమాలో నాగార్జున పాత్ర ఇంపాక్ట్ ఫుల్‌గా ఉందని ఆడియెన్స్ అంటున్నారు. ట్రైలర్ చూసిన నాటి నుంచి బుకింగ్స్‌పై ఆసక్తి పెరుగుతూనే ఉంది.

ఇప్పటికే మెట్రో సిటీలలో అడ్వాన్స్ బుకింగ్స్ తెరచుకోగానే మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా బుక్ మై షో వంటి టికెట్ ప్లాట్‌ఫామ్స్ లో ఈ సినిమా ట్రెండింగ్ నంబర్ వన్‌గా నిలవడం విశేషం. థియేటర్ల సంఖ్య పరిమితంగా ఉన్నప్పటికీ, ఒకే రోజు 12 వేలకుపైగా టికెట్లు అమ్ముడుపోవడం సెన్సేషనల్ ఫీట్ అనే చెప్పాలి.

అంతేకాదు, బుకింగ్స్ స్పీడ్ చూస్తే.. ఓపెనింగ్ డేనే భారీ కలెక్షన్లు నమోదు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్, రాయన్ వంటి హిట్లతో జోరుమీదున్న ధనుష్, నా సామీ రంగ బ్లాక్ బస్టర్ తర్వాత మరింత ఫోర్స్‌తో ఉన్న నాగార్జున, పాన్ ఇండియా క్రేజ్ కలిగిన రష్మిక మంధన్న కలయికలో వస్తోన్న సినిమా కాబట్టి అన్ని వర్గాల ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తోంది.

ఇక ఈ సినిమా ఓ సోషల్ పాయింట్ చుట్టూ నడుస్తుందన్న విషయం తెలిసిందే. కాన్సెప్ట్ కు నేచురల్‌గా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో, కంటెంట్ ఆధారంగా నడిచే సినిమాలకు ఆదరణ పెరుగుతోందని చెప్పవచ్చు. దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది. చాలా రోజులుగా మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆడియెన్స్ కు ఇది ఒక ట్రీట్ అని చెప్పవచ్చు. ప్రమోషన్ ప్లాన్ ద్వారా ‘కుబేరా’కు మంచి మార్కెట్ హైప్ దక్కింది.

మొత్తంగా చూస్తే.. విడుదలకు మూడు రోజుల ముందు నుంచే టికెట్ కౌంటర్ల వద్ద ఇలా రికార్డులు నమోదు చేయడం కేవలం బిజినెస్ పరంగా కాక, ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి నిదర్శనం. మిగిలిన రెండు రోజుల్లో ఈ హైప్ మళ్ళీ పెరిగితే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సాలిడ్ హిట్ ఖాయమని చెప్పొచ్చు. చూడాలి మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో.