యాచకుడి పాత్ర కోసం నో హోంవర్క్!
కోలీవుడ్ స్టార్ ధనుష్ ఎలాంటి పెర్మార్మన్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. అదే ట్యాలెంట్ తో టాలీవుడ్ లో ఫేమస్ అయ్యాడు. ఇక్కడ స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు.
By: Tupaki Desk | 11 Jun 2025 8:09 AMకోలీవుడ్ స్టార్ ధనుష్ ఎలాంటి పెర్మార్మన్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. అదే ట్యాలెంట్ తో టాలీవుడ్ లో ఫేమస్ అయ్యాడు. ఇక్కడ స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. బాలీవుడ్ లో సైతం ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న కోలీవుడ్ నటుడిగా రాణిస్తున్నాడు. ధనుష్ రేంజ్ లో సక్సెస్ ని ఇంత వరకూ ఏ కోలీవుడ్ నటుడు అందుకోలేదు. 'రాంజానా' లాంటి హిట్ తో ధనుష్ క్రేజ్ హిందీ మార్కెట్ లో ఎంతో ప్రత్యేకం.
త్వరలో 'కుబేర' సినిమాతో సంచలనం సృష్టిచడానికి రెడీ అవుతున్నాడు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో శేఖర్ కమ్ములా తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఇందులో నాగార్జున ఈడీ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు పీక్స్ కు చేరాయి. ఇందులో ధనుష్ యాచకుడి పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి.
పాత్రలో ధనుష్ ఆహార్యం సహా ప్రతీది కొత్తగా ఉంది. తాజాగా ఈ సినిమా ఆన్స్ సెట్స్ అనుభవాలు ధనుష్ రివీల్ చేసాడు. 'ఈ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్ చేసా. కానీ హోంవర్క్ చేసానైతే నని మాత్రం చెప్పను (నవ్వుతూ). శేఖర్ కమ్ములా చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయాను. సవాళ్లతో కూడిన ఈ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించాను. ఈ సినిమా షూటింగ్ నాకెన్నో జ్ఞాపకాలను మిగిల్చింది.
కొన్ని సన్నివేశాలు నా బాల్యాన్ని గుర్తు చేసాయి. ఈ సినిమా కోసం నేను ..రష్మి క ఓ డింపింగ్ యార్డ్ లో 7 గంటల పాటు కలిసి నటించాం. అక్కడ ఉన్నంత సేపు తను బాగానే ఉంది. నాకెలాంటి వాసర రావడం లేదని చెప్పింది. మరి ఆమెకు ఏమైందో నాకు తెలియదని' నవ్వేసారు.