Begin typing your search above and press return to search.

'కుబేర' మేకర్‌ క్రేజీ అనౌన్స్‌మెంట్‌

శేఖర్ కమ్ములతో ఒక స్టార్‌ హీరోతో సునీల్‌ నారంగ్‌ సినిమా ఉండబోతుంది. ఆ హీరో ఎవరు అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   8 Jun 2025 11:36 AM IST
కుబేర మేకర్‌ క్రేజీ అనౌన్స్‌మెంట్‌
X

ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమాను ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించగా, కీలక పాత్రలో నాగార్జున నటించాడు. ఈ సినిమాను ప్రముఖ డిస్టిబ్యూటర్‌ కమ్‌ ఎగ్జిబ్యూటర్‌ అయిన సునీల్‌ నారంగ్‌ నిర్మించారు. దాదాపు రెండేళ్లు మేకింగ్‌లో ఉన్న కుబేర సినిమాను ఎట్టకేలకు విడుదల చేయబోతున్నారు. ఈ మధ్య కాలంలో ధనుష్ సినిమాల్లో అత్యధిక సమయం పట్టిన సినిమాగా కుబేర సినిమా నిలిచింది. సునీల్‌ నారంగ్‌ బడ్జెట్‌కి వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు.

సునీల్‌ నారంగ్‌ వరుసగా సినిమాలను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు. కుబేర సినిమా విడుదల కాకుండానే నిర్మాత సునీల్ నారంగ్‌ మరో రెండు ప్రాజెక్ట్‌లను నిర్మించేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాను నిర్మించిన సునీల్ నారంగ్‌ మరో ప్రాజెక్ట్‌ను ఆయనతో నిర్మించేందుకు సిద్ధం అయ్యారు. కుబేర సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిర్మాత సునీల్‌ నారంగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బ్యానర్‌ లో రాబోయే రెండు సినిమాల గురించి ప్రకటించాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాను నిర్మించబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. కుబేర సినిమా అయిన వెంటనే కొత్త సినిమాను ఆయన దర్శకత్వంలో మొదలు పెట్టనున్నట్లు పేర్కొన్నారు.

శేఖర్ కమ్ములతో ఒక స్టార్‌ హీరోతో సునీల్‌ నారంగ్‌ సినిమా ఉండబోతుంది. ఆ హీరో ఎవరు అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక సీనియర్ హీరోకి శేఖర్ కమ్ములతో కథను చెప్పించారని సమాచారం అందుతోంది. ఆ విషయం గురించి కుబేర సినిమా విడుదల తర్వాత అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ఇక సునీల్‌ నారంగ్‌ నిర్మించబోతున్న మరో ప్రాజెక్ట్‌కి ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈయన 96, మెయియఝగన్‌ సినిమాలతో తమిళంలో సూపర్‌ హిట్‌ను అందుకున్నాడు. తెలుగులో జాను, సత్యం సుందరం సినిమాలతోనూ ప్రేమ్‌ కుమార్‌కి మంచి గుర్తింపు, స్టార్‌డం దక్కిన విషయం తెల్సిందే.

ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల మాదిరిగానే సెన్సబుల్‌ సబ్జెక్ట్‌తో సునీల్‌ నారంగ్‌ ఒక సినిమాను నిర్మించబోతున్నాడు. ప్రేమ్‌ కుమార్‌తో నిర్మించబోతున్న సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయబోతున్నారు. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నిర్మించబోతున్న సినిమాకు హీరో ఎవరు అనే విషయంలో ఇంకా ఎలాంటి సమాచారం లేదు. కుబేర సినిమా విడుదల తర్వాత ఆ రెండు సినిమాల పనులను వేగవంతం చేసే విధంగా నిర్మాత ప్లాన్‌ చేసుకుని ఉంటారని తెలుస్తోంది. ముందు ముందు సునీల్‌ నారంగ్‌ నుంచి స్టార్‌ హీరోల సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న పరిచయాల కారణంగా పెద్ద హీరోల డేట్లు ఆయనకు పెద్ద కష్టం కాకపోవచ్చు.