థియేటర్‌లో రెస్పెన్స్‌కు ఎమోషనల్ అయిన హీరో!
శేఖర్ కమ్ములతో ధనుష్ తొలి సారి కలిసి చేసిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా `కుబేర`. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలోని కీలక పాత్రలో కింగ్ నాగార్జున నటించారు.
By: Tupaki Desk | 20 Jun 2025 4:04 PM ISTశేఖర్ కమ్ములతో ధనుష్ తొలి సారి కలిసి చేసిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా `కుబేర`. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలోని కీలక పాత్రలో కింగ్ నాగార్జున నటించారు. సినిమా ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్న `కుబేర` ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శేఖర్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకత ఉంది. ఆయన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చేస్తారని, అంతే కాకుండా మనసుకు హత్తుకునే సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా ఆయన సినిమా ఉంటుందని తెలుగు ప్రేక్షకుల్లో ఓ గుర్తింపు ఉంది.
అదే ఫార్ములాతో కమర్షియల్ లెక్కలకు దూరంగా, రియలిస్టిక్ అప్రోచ్‌తో శేఖర్ కమ్ముల చేసిన సినిమా ఇది. సింపుల్ కథలకు సున్నితమైన భావోద్వాగాల్ని జోడించి శేఖర్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాయి. ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని వారి నీరాజనాలందుకున్నాయి. `కుబేర` కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని మొదటి నుంచి శేఖర్ కమ్ముల గట్టి నమ్మకంతో చెబుతూ వచ్చారు.
ఫైనల్‌గా ఈ మూవీ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ప్రేక్షకులతో పాటు ఈ మూవీని ఫస్ట్ డే ఫస్ట్ మార్నింగ్ షోని థియేటర్లలో చూడాలని నిర్ణయించుకున్న హీరో ధనుష్ చెన్నైలోని శుక్రవారం ఓ థియేటర్‌కు వెళ్లారు. థియేటర్లో ధనుష్ నటనకు ముగ్థులైన ప్రేక్షకులు అరుపులు, కేకలు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అది చూసిన ధనుష్ ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రేక్షకులు సినిమా చూస్తూ ఆనందంతో అరుపులు,కేరింతలతో థియేటర్‌ని హోరెత్తిస్తుంటే అదే థియేటర్‌లో సినిమా చూస్తున్న ధనుష్ కూర్చీలో పలికించిన హావ భావాలు, ప్రేక్షకుల ఆనందానికి మంత్రముగ్ధుడై భావోద్వానికి లోనైన దృశ్యాలు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యక్ష్యంగా ప్రేక్షకుల రెస్పాన్స్ కళ్లెదుటే కనిపిస్తుండటం, తన నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తుండటంతో ధనుష్ ఎమోషనల్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
