కొడుకు కోసం తిరిగి కలిసిన ఐశ్వర్య- ధనుష్
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.. తన భర్త, ప్రముఖ కోలీవుడ్ హీరో ధనుష్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 Jun 2025 3:13 PM ISTసూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.. తన భర్త, ప్రముఖ కోలీవుడ్ హీరో ధనుష్ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. తన కుమార్తె- అల్లుడు బ్రేకప్‌ని 74 ఏళ్ల రజనీకాంత్ జీర్ణించుకోలేకపోయారు. వారిద్దరినీ కలిపేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. కానీ చివరకు ఈ జంట విడిపోయి ఎవరి దారిలో వారు ఉన్నారు. అయితే విడిపోయినా కానీ, తమ పిల్లలకు సహ తల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు.
ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిన తమ కుమారుడి అఛీవ్ మెంట్ ని సెలబ్రేట్ చేసేందుకు ఐశ్వర్య-ధనుష్ తిరిగి కలిసారు. ఇదిగో ఇక్కడ కుమారుడిని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుని ఆనందంలో ఉన్న ఈ జంట ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ అరుదైన దృశ్యం హృదయాన్ని టచ్ చేస్తోంది. 18 ఏళ్లు నిండిన తనయుడు చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. ఈ ఆనంద క్షణాన్ని ఐశ్వర్య, ధనుష్ ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేరు.
ధనుష్ ఇన్‌స్టాలో ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. భార్యాభర్తలు విడిపోయినా, ఇలా కొడుకు కోసం కలిసి రావడం వీక్షకులను ఎమోషన్ కి గురి చేస్తోంది. ధనుష్ నటనా కెరీర్ విషయానికి వస్తే, అతడు తదుపరి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన `కుబేర`లో కనిపించనున్నారు. అక్కినేని నాగార్జున ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. తదుపరి ధనుష్ కి భారీ లైనప్ ఉంది. ఇక ఇటీవల ఐశ్వర్య ధనుష్ దర్శకురాలిగా ప్రయత్నించినా విఫలమైంది. తన కొత్త సినిమా గురించిన అప్ డేట్ రావాల్సి ఉంది.
