Begin typing your search above and press return to search.

2025లో 'దేవా'కి మూడు హిట్స్‌ ఖాయం

కుబేర సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ధనుష్‌ ఇదే ఏడాది మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   2 July 2025 10:47 AM IST
2025లో దేవాకి మూడు హిట్స్‌ ఖాయం
X

కుబేర సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ధనుష్‌ ఇదే ఏడాది మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర సినిమాలో దేవా పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ధనుష్‌ మరో వంద కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళనాట ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు కానప్పటికీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ధనుష్‌కి తెలుగు బాక్సాఫీస్‌ వద్ద దాదాపుగా రూ.100 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ఆఫ్ ది ఇయర్‌గా కుబేర నిలిచిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ధనుష్ తదుపరి రెండు సినిమాల గురించి చర్చ జరుగుతోంది.

ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇడ్లీ కడై' సినిమా సైతం తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ను అంతా వ్యక్తం చేస్తున్నారు. ఇడ్లీ కడై సినిమా తెలుగులో ఏ మేరకు హిట్‌ అవుతుంది అనేది క్లారిటీ లేదు, కానీ తమిళ్‌ లో మాత్రం కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ముఖ్యంగా కోలీవుడ్‌ వర్గాల వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాట ఇడ్లీ కడై సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే తెలుగులోనూ ఓ మోస్తరు వసూళ్లు 'కుబేర' కారణంగా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇడ్లీ కడై సినిమాను ధనుష్ రూపొందిస్తూ ఉండగా, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నాడు. ధనుష్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 1న సినిమాను విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ధనుష్ నుంచి రాబోతున్న అతి పెద్ద సినిమాగానూ ఇడ్లీ కడై సినిమాపై చర్చ జరుగుతోంది. ధనుష్‌ లుక్‌, కథ ఇతర అన్ని ఎలిమెంట్స్ చూస్తూ ఉంటే మరో రాయన్ సినిమా రేంజ్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇడ్లీ కడై సినిమా తర్వాత ధనుష్ హిందీ సినిమా తేరీ ఇష్క్‌ మేన్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆనంద్‌ ఎల్‌ రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి సనన్‌ నటిస్తోంది.

ఇటీవలే తేరీ ఇష్క్‌ మేన్‌ చిత్రంకు సంబంధించిన ధనుష్ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి చేసినట్లుగా దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ప్రకటించాడు. తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. హిందీ, తమిళ్‌లో ఈ సినిమాకు ఇప్పటికే విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయింది. హిందీలో ధనుష్ చేసిన సినిమాలకు మంచి స్పందన దక్కింది. అందుకే ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే కుబేర సినిమాతో హిట్‌ కొట్టి 2025 లో ఖాతా తెరచిన ధనుష్ అక్టోబర్‌ లో ఇడ్లీ కడై సినిమాతో వచ్చి హిట్‌ కొట్టబోతున్నాడు.

ఇక ఇదే ఏడాది చివర్లో అంటే నవంబర్‌లో తేరీ ఇష్క మేన్‌ సినిమాతో రానున్నాడు. ఆ సినిమా కూడా హిట్‌ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో 2025 లో ధనుష్ మూడు హిట్స్‌తో హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకే ఏడాది మూడు సినిమాలను విడుదల చేయడం స్టార్‌ హీరోలకు సాధ్యం కాదు. అలాంటిది మూడు సినిమాలతో సూపర్‌ హిట్‌ కొట్టడం అనేది కచ్చితంగా అరుదైన విషయం. మరి ఆ అరుదైన ఘనత ధనుష్ దక్కించుకుంటాడా అనేది చూడాలి.