Begin typing your search above and press return to search.

ధనుష్ 'జైలర్‌' కోసం చర్చలు జరుగుతున్నాయా..?

తమిళ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ సాలిడ్ కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకుని పుష్కర కాలం కు పైగా అయింది

By:  Tupaki Desk   |   30 Oct 2023 3:30 PM GMT
ధనుష్ జైలర్‌ కోసం చర్చలు జరుగుతున్నాయా..?
X

తమిళ్‌ సూపర్ స్టార్ రజినీకాంత్ సాలిడ్ కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకుని పుష్కర కాలం కు పైగా అయింది. ఇక రజినీకాంత్‌ పనైపోయిందని అంతా భావిస్తున్న తరుణం లో జైలర్ సినిమాతో రజినీకాంత్ కు నెల్సన్‌ దిలీప్ భారీ విజయాన్ని కట్టబెట్టాడు. దాదాపుగా 400 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేసిన జైలర్‌ సినిమా తో రజినీకాంత్‌ పూర్వ వైభవంను సంతరించుకున్నాడు.

రజినీకాంత్ మరో పదేళ్ల పాటు హీరోగా సినిమాలు చేసే విధంగా జైలర్‌ సినిమా బూస్ట్‌ ఇచ్చింది అనడంలో సందేహం లేదు. ఇక జైలర్ సినిమాను రూపొందించిన దర్శకుడు నెల్సన్‌ దిలీప్ కూడా భారీ క్రేజ్ ను దక్కించుకున్నాడు. ఆయన తో సినిమాలు చేసేందుకు ప్రముఖ హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కథతో వస్తే సినిమా చేద్దామని చాలా మంది నెల్సన్ కి మెసేజ్ చేశారట.

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు కూడా నెల్సన్‌ దిలీప్ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నెల్సన్ దిలీప్ తన తదుపరి సినిమాను ధనుష్ తో చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ధనుష్ కి నెల్సన్‌ ఒక కథను చెప్పాడు.. దానికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

జైలర్‌ సినిమా తరహాలో ఒక క్రైమ్‌ థ్రిల్లర్ మూవీని ధనుష్ తో నెల్సన్‌ దిలీప్ రూపొందించేందుకు సిద్ధం అవుతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ధనుష్ ప్రస్తుతం చేస్తున్న కెప్టెన్ మిల్లర్ సినిమా పూర్తి అయిన తర్వాత నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ధనుష్ మూవీ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

ధనుష్‌ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నాడు. అందులో తెలుగు లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా ఒకటి ఉంది. వాటన్నింటి కన్నా ముందు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఒక సినిమా ను ధనుష్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్‌ స్పీడ్‌ తో జైలర్‌ సినిమాను పూర్తి చేసిన నెల్సన్‌ అదే ఫార్ములాతో ధనుష్ సినిమాని కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.

నెల్సన్‌ దిలీప్ ఖాతాలో ఒక లేడీ ఓరియంటెడ్‌ మూవీ కూడా ఉంది. ఆ సినిమా ను నయనతార తో చేయాలని నెల్సన్ దిలీప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ధనుష్ సినిమా తో పాటు నయనతార సినిమాను దర్శకుడు నెల్సన్‌ దిలీప్ సమాంతరంగా చేసే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు నెల్సన్‌ నుంచి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.