Begin typing your search above and press return to search.

డ్యాన్స్ వీడియో: చాహ‌ల్ మాజీ భార్య ప్రీవ‌ర్క‌వుట్

మ‌రోవైపు ధ‌న‌శ్రీ వ‌ర్మ ఇన్ స్టాలో వేడెక్కించే ఫోటోషూట్లు, డ్యాన్సింగ్ క్లిప్స్ తో నిరంత‌రం త‌న‌ అభిమానుల‌ను అల‌రిస్తోంది.

By:  Tupaki Desk   |   18 July 2025 9:31 AM IST
డ్యాన్స్ వీడియో: చాహ‌ల్ మాజీ భార్య ప్రీవ‌ర్క‌వుట్
X

క్రికెట‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ నుంచి విడాకులు తీసుకున్న కొరియోగ్రాఫ‌ర్ ధ‌న‌శ్రీ వ‌ర్మ కొంత కాలంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ధ‌న‌శ్రీ ఇప్పుడు స‌ల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 19లో క‌నిపిస్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ధనశ్రీ బిగ్ బాస్ 19 నిర్వాహ‌కుల‌కు ట‌చ్ లో ఉంద‌న్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది.

బిగ్ బాస్ 19 పరిణామాలపై అప్ డేట్స్‌కి అంకితమైన ఇన్‌స్టా పేజీ వివ‌రం ప్రకారం.. ధనశ్రీని ఇప్ప‌టికే బిగ్ బాస్ 19 కోసం నిర్వాహ‌కులు సంప్రదించారు. డ్యాన్సింగ్ క్వీన్‌ వారితో తుది చర్చలు జ‌రుపుతోంది. ఇటీవ‌ల‌ ధ‌న‌శ్రీ `ఖత్రోన్ కే ఖిలాడి 15` కోసం లాక్ అయింది. కానీ షో చిత్రీక‌ర‌ణ ఇంకా జరగలేదు. కాబట్టి ఇప్పుడు ధనశ్రీ బిగ్ బాస్ ఆఫర్‌ను అంగీకరించినట్టే. ఇది ఇంకా ఫైనల్ కాదు.. తుది చర్చలు ఉత్సాహంగా సాగుతున్నాయి!`` అని బిగ్ బాస్ ఇన్ స్టా పేజీ పేర్కొంది.

మ‌రోవైపు ధ‌న‌శ్రీ వ‌ర్మ ఇన్ స్టాలో వేడెక్కించే ఫోటోషూట్లు, డ్యాన్సింగ్ క్లిప్స్ తో నిరంత‌రం త‌న‌ అభిమానుల‌ను అల‌రిస్తోంది. ధ‌న‌శ్రీ టైట్ స్పోర్ట్స్ వేర్ ధ‌రించి అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న ఓ వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. జిమ్ కి వెళ్లే ముందు ``ప్రీవ‌ర్క‌వుట్`` అనే క్యాప్ష‌న్ ని ఇచ్చింది.

బ్రేక‌ప్ మ్యాట‌ర్:

ఈ ఏడాది ఆరంభంలో క్రికెట‌ర్ యుజ్వేంద్ర చాహల్ నుంచి విడాకుల నేప‌థ్యంలో ధ‌న‌శ్రీ‌ మీడియా హెడ్ లైన్స్ లో నిలిచింది. ఈ జంట‌ డిసెంబర్ 2020లో గుర్గావ్ లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల‌కే మ‌న‌స్ఫ‌ర్థ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఫిబ్రవరి 2025లో బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 18 నెలలు విడివిడిగా జీవించిన తర్వాత 20 మార్చి 2025న అధికారికంగా విడిపోయారు. యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మకు రూ.4.75 కోట్లు జీవనభృతిగా చెల్లించారు.