సాయి పల్లవి తర్వాత ధనశ్రీకే ఆ ఛాన్స్
క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ - కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకుల వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 April 2025 3:30 AMక్రికెటర్ యజ్వేంద్ర చాహల్ - కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకుల వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ట్రైనింగ్ క్లాస్‌లో ప్రేమలో పడిన ఈ జంట పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఏడాదిలోనే పెళ్లి బ్రేకప్ అవ్వడంతో అభిమానులు ఆందోళన చెందారు.
అయితే గతం గతః. ప్రస్తుతం విడాకుల తర్వాత ఎవరి దారిలో వారు ఉన్నారు. కెరీర్ పరంగా ఎవరికి వారు బిజీ అయ్యారు. ధనశ్రీవర్మ తమిళ ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేటకు ఈ ప్రతిభావని నటనలో అడుగుపెడుతూ తన తొలి తెలుగు చిత్రానికి సంతకం చేసింది. అది కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మించే చిత్రంలో క్రేజీగా అవకాశం అందుకుంది. డ్యాన్స్ బేస్డ్ కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి `ఆకాశం దాటి వస్తావా` అనే క్లాసిక్ టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు. సాయిపల్లవి లాంటి కొరియోగ్రాఫర్ కి అవకాశాలు కల్పించిన దిల్ రాజు ఆ తర్వాత నటిగాను పలు చిత్రాలతో ఎంకరేజ్ చేసారు. ఇప్పుడు ధనశ్రీకి అలాంటి అవకాశం కల్పిస్తున్నారు.
శ్రీ శశి కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ నృత్య ప్రధాన చిత్రంలో కొత్త నటీనటులకు అవకాశం కల్పిస్తున్నారు. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ధనశ్రీ వర్మ వృత్తి రీత్యా డెంటిస్ట్ అయినా కానీ, సినీరంగంలో కొరియోగ్రాఫర్‌గా ఎదిగారు. ఇప్పుడు నటిగా మారుతున్నారు.