Begin typing your search above and press return to search.

పార్ట్నర్​తో తాప్సీ గోడవేంటి?

సొట్ట బుగ్గల చిన్నది తాప్సీపన్ను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన సక్సెస్ దక్కకా బాలీవుడ్​కు మకాం మార్చేసింది

By:  Tupaki Desk   |   14 Oct 2023 5:46 AM GMT
పార్ట్నర్​తో తాప్సీ గోడవేంటి?
X

సొట్ట బుగ్గల చిన్నది తాప్సీపన్ను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన సక్సెస్ దక్కకా బాలీవుడ్​కు మకాం మార్చేసింది. అక్కడ మంచి సెక్సెస్​లను అందుకుంది. ప్రస్తుతం బీటౌన్​లో నటిగా ప్రత్యేకతను చాటుకున్న ఆమె.. నిర్మాతగా తనకంటూ ఓ గర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.

తాజాగా ఆమె నిర్మాతగా మారి తీసిన తన తొలి చిత్రం ధక్ ధక్. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్​లో ఆమె ఎక్కువగా పాల్గొనట్లేదని అర్థమవుతోంది. ఆమె అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ.. తన ప్రొడక్షన్ పార్ట్నర్​తో అన్​హ్యాపీగా ఉన్నట్లు తెలిసింది. అందుకే ప్రమోషన్స్​లో ఎక్కువ యాక్టివ్​గా ఉండట్లేదని కథనాలు వస్తున్నాయి.

తాప్సీ విభేదాల గురించి కాస్త పక్కనపెడితే ధక్ ధక్ సినిమా మాత్రం బాక్సాఫీస్​ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎమోషన్స్, అడ్వెంచర్స్​, సెల్ఫ్ డిస్కవరీ వంటి అంశాలతో సాగిన నాలుగు సాధారణ మహిళలు బైక్ రైడ్ జర్నీనే ఈ సినిమా కథ. వీరి పాత్రలకు మంచి విశేష ఆదరణ దక్కింది.

మరి ఈ రెస్పాన్స్​ను.. ఈ వీకెండ్​తో పాటు వచ్చే వారం కూడా కొనసాగిస్తే కమర్షియల్​గా మంచి వసూళ్లను అందుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద విన్నర్​గా నిలుస్తుంది. చూడాలి మరి ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో. నిర్మాతగా ఈ సినిమా తాప్సీకి ఎలాంటి రిజల్ట్​ను అందిస్తుందో.. ఇకపోతే సినిమాలో టాలెంటెడ్​ కాస్ట్ నటించారు. రత్న పథక్ షా, ఫాతిమా సనా షైక్, దియా మిర్జా, సంజన సంఘి.. ప్రధాన పాత్రల్లో కనిపించారు.

ఇకపోతే సినిమాకు తరుణ్ డుడేజ కథ అందించి దర్శకత్వం వహించారు. అజిత్ అంధారె, కెవిన్ వాజ్, ప్రంజల్ ఖాన్​డియా, తాప్సీ పన్ను నిర్మాతలుగా వ్యవహరించారు. బీఎల్​ఎమ్ పిక్టర్స్​, ఔట్​సైడర్ ఫిల్మ్ ప్రొడక్షన్స్​, వయాకామ్ 18 స్టూడియోస్​ బ్యానర్లు కలిసి నిర్మించాయి. కాగా, తాప్సీ ప్రస్తుతం షారుక్ ఖాన్ డంకీ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు ఓ లడ్కీ హై కహాన్​, ఫిర్​ ఆయి హసీన్​ దిల్​రూబా చిత్రాల్లో నటిస్తోంది.