Begin typing your search above and press return to search.

జాన్వీ కపూర్‌ ఫస్ట్‌ మూవీ... సీక్వెల్‌ ట్రైలర్‌ చూశారా!

సిద్దాంత్‌ చతుర్వేది హీరోగా త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా ధడక్ 2 సినిమా రూపొందింది. ఫస్ట్‌ లుక్ వచ్చినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి.

By:  Tupaki Desk   |   11 July 2025 7:56 PM IST
జాన్వీ కపూర్‌ ఫస్ట్‌ మూవీ... సీక్వెల్‌ ట్రైలర్‌ చూశారా!
X

జాన్వీ కపూర్‌ మొదటి సినిమా 'ధడక్‌'. బాలీవుడ్‌లో వచ్చిన ధడక్‌ సినిమా యావరేజ్‌ టాక్‌ను దక్కించుకుంది. శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్‌ మొదటి సినిమా అని ధడక్‌ కి ప్రచారం చేసిన నేపథ్యంలో పాజిటివ్‌ బజ్‌ ను క్రియేట్‌ చేసింది. ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన ధడక్ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. సినిమా కు వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి. కొన్ని రివ్యూల్లో సినిమాకు నెగటివ్‌ మార్కులు ఎక్కువగా పడ్డాయి. అందుకే ధడక్‌ సినిమా ఒక ఫెయిల్యూర్‌ మూగానే నిలిచింది. జాన్వీ కపూర్‌ మొదటి సినిమా కావడంతో ధడక్‌ ఎప్పుడూ స్పెషల్‌గానే నిలిచింది. ఇన్నాళ్ల తర్వాత ధడక్‌ సినిమాకు సీక్వెల్‌ వచ్చింది.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో ప్రాంచైజీ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఒక పార్ట్‌కి మరో పార్ట్‌ కి సంబంధం లేకుండా, కథకు సంబంధం లేకుండా, పూర్తిగా వేరు వేరు నటీ నటులతో రూపొందుతున్న సినిమాలకు అదే టైటిల్‌ను పెడుతున్నారు. ప్రాంచైజీ సినిమాల జాబితాలో ధడక్‌ సినిమా నిలిచింది. గత ఏడాది నుంచే ధడక్‌ 2 సినిమా గురించి చర్చ జరుగుతోంది. సిద్దాంత్‌ చతుర్వేది హీరోగా త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా ధడక్ 2 సినిమా రూపొందింది. ఫస్ట్‌ లుక్ వచ్చినప్పటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఈ సినిమాను కరణ్‌ జోహార్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆగస్టు 1న బాక్సాఫీస్‌ వద్ద అదృష్టంను పరీక్షించుకోబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ధడక్‌ సినిమా మాదిరిగానే ఈ సినిమా రొమాంటిక్ లవ్‌ స్టోరీతో రూపొందింది. బాలీవుడ్‌లో ఈ తరహా లవ్‌ స్టోరీలు ఎన్నో వచ్చాయి. కాలేజ్ బ్యాక్‌ డ్రాప్ లవ్‌ స్టోరీ, ఆ లవ్‌ స్టోరీకి పెద్దలు అంగీకరించక పోవడం వంటి స్క్రీన్‌ ప్లేతో ఈ సినిమా సాగుతుందని ట్రైలర్‌ ని చూస్తుంటే అనిపిస్తుంది. ఇలాంటి కథతో సినిమాలు చాలానే వచ్చాయి. కనుక స్క్రీన్‌ ప్లే తో మ్యాజిక్‌ చేస్తాడేమో చూడాలి. కరణ్‌ జోహార్‌ బ్యానర్‌ నుంచి వస్తున్న సినిమా కనుక కచ్చితంగా మినిమం అంచనాలు ఉంటాయి. పైగా ధడక్ ప్రాంచైజీ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి.

షాజియా ఇక్బాల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా మ్యూజికల్‌గానూ ఆకట్టుకుంటుందని ట్రైలర్‌ను చూస్తు ఉంటే అనిపిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యానిమల్‌ సినిమా తర్వాత త్రిప్తి డిమ్రి వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ హిందీలో ఆమె నటించిన ఏ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. మరి ఈ సినిమా అయినా ఆమెకు హిట్‌ ఇచ్చేనా చూడాలి. ఇటీవలే త్రిప్తి డిమ్రి ని సందీప్‌ రెడ్డి వంగ తన స్పిరిట్‌ సినిమాలో ఎంపిక చేయడం జరిగింది. దీపిక పదుకునేకు చెందిన పీఆర్‌ టీం ఈమెపై కుట్రలు చేస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ విషయమై సోషల్‌ మీడియాలో వివాదం కొనసాగుతోంది.