Begin typing your search above and press return to search.

బికినీలో 'సైతాన్' జయప్రద.. గ్లామర్ షో రిపీట్!

బ్లాక్ బికినీలో దిగిన కిర్రాక్ పిక్ ను షేర్ చేసింది దేవియాని. సాల్టీ హెయిర్, బికినీ మైండ్ సెట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తన అందంతో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   4 April 2024 5:05 AM GMT
బికినీలో సైతాన్ జయప్రద.. గ్లామర్ షో రిపీట్!
X

రెండు వెబ్ సిరీసులతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది దేవియాని శర్మ. ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ.. కొన్నేళ్ల క్రితం వచ్చిన భానుమతి రామకృష్ణ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత రొమాంటిక్ సినిమాతో పాటు వివిధ చిత్రాల్లో సందడి చేసింది. సేవ్ ది టైగర్స్, సైతాన్ సిరీసుల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.

సేవ్ ది టైగర్స్ సిరీస్ లో హై ప్రొఫైల్ ఫెమినిస్ట్ లాయర్ గా నటించిన ఈ నార్త్ ఇండియా భామ.. తన అందం, అభినయంతో తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఇక సైతాన్ వెబ్ సిరీస్ లో రఫ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ జయప్రద రోల్ లో అదరగొట్టింది. తాను ఎంచుకున్న మార్గానికి అడ్డం వచ్చిన వారిని చంపేందుకు కూడా వెనుకాడని మహిళ పాత్రలో కనిపించింది. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి.

అయితే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ.. ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు షేర్ చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంటోంది. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేస్తూ సందడి చేస్తుంటోంది. టాలీవుడ్ లో భారీగా ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. గ్లామర్ డోస్ లో తగ్గేదేలే అంటూ స్టిల్స్ ఇస్తుంటోంది. ఇటీవల పొట్టి వైట్ డ్రెస్ లో ఫిదా చేసిన ఈ అమ్మడు.. మరోసారి కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది.

బ్లాక్ బికినీలో దిగిన కిర్రాక్ పిక్ ను షేర్ చేసింది దేవియాని. సాల్టీ హెయిర్, బికినీ మైండ్ సెట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తన అందంతో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. ఎద అందాలతో కవ్విస్తోంది. థైస్ షోతో మతులు పోగుడుతోంది. ఓ టూరిస్ట్ ప్లేస్ లో దిగిన దేవియాని పిక్ కు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. బికినీలో బ్యూటీని చూసి ఎవరైనా ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా అని కామెంట్లు పెడుతున్నారు.

మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దేవియాని.. యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో కొన్ని స్టేజ్ డ్రామాల్లో నటించింది. బాలీవుడ్ లో లవ్ శుద సినిమాలో చిన్న రోల్ చేసింది. ఆ తర్వాత అక్కడ అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కు వచ్చేసింది. హైదరాబాద్ వచ్చాక తెలుగు నేర్చుకుని బాగా మాట్లాడేస్తోంది. ఇప్పుడు బడా ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకునేందుకు ట్రై చేస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.