Begin typing your search above and press return to search.

దేవియాని హై గ్లామర్ డోస్.. అన్‌స్టాపబుల్!

ఈ ఫోటోల్లో దేవియాని తన మూడీ మూడ్‌కి తగ్గట్లుగా, హాలీవుడ్‌ స్టైల్‌లో స్టైలింగ్ చేసుకుంది. చక్కగా వుండే కర్లీ హెయిర్, మినిమల్ మేకప్, డీప్ బ్రౌన్ లిప్‌షేడ్ ఆమె లుక్స్‌కు మరింత హైలైట్‌గా నిలిచాయి.

By:  Tupaki Desk   |   5 July 2025 9:47 PM IST
దేవియాని హై గ్లామర్ డోస్.. అన్‌స్టాపబుల్!
X

నార్త్ బ్యూటీ దేవియాని శర్మ సోషల్ మీడియాలో తనదైన స్టైల్‌తో క్రేజ్‌ను పెంచుకుంటూ దూసుకెళ్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. డిఫరెంట్ లైటింగ్‌తో, మోడర్న్ స్టైలింగ్‌లో దేవియాని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్లాస్‌, గ్లామర్ ను మిక్స్‌ చేసిన ఈ లుక్‌కి కామెంట్స్ వర్షం కురుస్తోంది. 'షార్ప్', 'అటిట్యూడ్ కిల్లింగ్', 'అన్‌స్టాపబుల్ గ్లామర్' అంటూ అభిమానులు తెగ కామెంట్ చేస్తున్నారు.

ఈ ఫోటోల్లో దేవియాని తన మూడీ మూడ్‌కి తగ్గట్లుగా, హాలీవుడ్‌ స్టైల్‌లో స్టైలింగ్ చేసుకుంది. చక్కగా వుండే కర్లీ హెయిర్, మినిమల్ మేకప్, డీప్ బ్రౌన్ లిప్‌షేడ్ ఆమె లుక్స్‌కు మరింత హైలైట్‌గా నిలిచాయి. ఫోటోషూట్ మాత్రమే కాదు, ఆమె క్యాప్షన్ కూడా అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. “జీవితంలో ఎదురైన కష్టాలే నాకు బలం.. ఇప్పుడు నాకు నేనే ముఖ్యం” అంటూ దేవియాని రాసిన మాటలు ఆమె స్వాభిమానాన్ని చాటుతున్నాయి.

వెబ్ సిరీస్‌ల ద్వారా వెలుగులోకి వచ్చిన దేవియాని 'సేవ్ ది టైగర్స్', 'షైతాన్' వంటి హిట్ కంటెంట్‌ ప్రాజెక్ట్స్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె నటన, బాడీ లాంగ్వేజ్‌, ఇంటెన్స్ క్యారెక్టర్లపై అందరికీ మంచి ఇంప్రెషన్ వచ్చింది. ఈ సక్సెస్‌తో ఆమెకు ఇతర భాషల నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఓ మిడ్ రేంజ్ హీరోతో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆన్ స్క్రీన్‌లో అంతగా లిమిట్స్ పెట్టుకోని దేవియాని, గ్లామర్‌కు సంబంధించిన పాత్రలపైనా ఓపెన్‌గా స్పందిస్తూ వస్తోంది. తాను ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్‌కైనా సిద్ధమనే దిశగా, ఇలాంటి ఫోటోషూట్స్‌ చేస్తూ క్యారెక్టర్ బిల్డప్‌ చేస్తోంది. ఆమె తనకు తానే మార్కెటింగ్ చేసుకుంటూ, సోషల్ మీడియాలో స్ట్రాంగ్ ఫాలోయింగ్‌తో ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ను నిలబెట్టుకుంటోంది.