పిక్‌టాక్ : టైగర్ బ్యూటీ అల్టీమేట్ అందాల ఫోజ్
ఒక కాలు పూర్తిగా పైకి ఎత్తి తన మార్షల్ ఆర్ట్స్ విద్యను ఈ అమ్మడు ఫోటోల్లో చూపించింది. పెద్దగా స్కిన్ షో చేయకున్నా కూడా ఈ ఫోజ్‌కి అంతా ఫిదా అవుతున్నారు.
By: Tupaki Desk | 7 July 2025 11:00 PM IST'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్‌తో నటిగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ముద్దుగుమ్మ దేవియాని శర్మ. ఈ అమ్మడు టాలీవుడ్‌లో తన సత్తా చాటడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. వచ్చిన ఏ ఒక్క అవకాశంను చేజార్చుకోకుండా ది బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో స్కిన్ షో చేసేందుకు అవకాశం రాలేదు, అయినా కూడా నటిగా తన ప్రతిభను చూపించింది. పద్దతిగా కనిపించినా అందంగా కనిపించింది. మోడ్రన్ డ్రెస్‌లు వేయకున్నా కూడా చక్కని ఫిజిక్ కారణంగా చీర కట్టులోనూ ఆకట్టుకుంది. మెల్ల మెల్లగా సినిమాలు, సిరీస్‌ల్లో గుర్తింపు దక్కించుకుంటున్న ఈమె సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా దక్కిన గుర్తింపు కారణంగా హీరోయిన్స్‌గా ఆఫర్లు వస్తున్నాయి. అందుకే రెగ్యులర్‌గా దేవియాని శర్మ తన అందమైన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది. పలు స్కిన్ షో ఫోటోలతో పాటు, కొన్ని వీడియోలను సైతం ఈమె షేర్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు కాకున్నా ఇంకొన్నాళ్లకు అయినా తన అందంను ఇండస్ట్రీ వర్గాల వారు గుర్తిస్తారని ఈమె నమ్ముతున్నట్లుగా ఉంది. అందుకే రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పెంచింది. ఈసారి చూపు తిప్పనివ్వకుండా అందమైన పిక్స్ ను షేర్ చేసింది.
ఒక కాలు పూర్తిగా పైకి ఎత్తి తన మార్షల్ ఆర్ట్స్ విద్యను ఈ అమ్మడు ఫోటోల్లో చూపించింది. పెద్దగా స్కిన్ షో చేయకున్నా కూడా ఈ ఫోజ్‌కి అంతా ఫిదా అవుతున్నారు. బాబోయ్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్‌పర్ట్స్ కూడా ఈ స్థాయిలో కాలును అంతగా పైకి లేపలేరు కదా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సింపుల్ అండ్ స్వీట్ లుక్‌తో ఎప్పటికప్పుడు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్న ఈ అమ్మడు మరోసారి అందమైన ఈ ఫోటోలను షేర్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ అల్టీమేట్ అందాల ఫోజ్‌కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఇంత అందంగా ఉన్న దేవియాని శర్మకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఫోటోలతో పాటు దేవియాని శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో... పురోగతి కోసం కదలికలను తప్పు పట్టవద్దు. ప్రతీకారం అనేది ఒక కొండ పైకి బండరాయిని వేయడం లాంటిది, అది వెనక్కి తిరిగి మిమ్మల్ని నలిపేయడం జరుగుతుంది. గ్రహాల కక్ష్యలను నేను అంచనా వేయగలను, కానీ మానవ స్వభావం యొక్క గందరగోళం అంచనా వేయలేక పోతున్నాను. కానీ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండాలని అనుకుంటున్నాను అంటూ విభిన్నమైన లైన్స్ ను షేర్ చేసింది. అందమైన రూపం ఉన్న దేవియానిలో అందమైన కవయిత్రి కూడా ఉన్నట్లు అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రతిభతో పాటు, అందం ఉన్న ముద్దుగుమ్మలకు ఆలస్యంగా అయినా ఆఫర్లు దక్కుతాయి. కనుక దేవియాని ఓపికతో వెయిట్ చేయాలని నెటిజన్స్ కొందరు కామెంట్ చేస్తున్నారు.
