Begin typing your search above and press return to search.

దేవి కూడా వీర లెవెల్ మోతకు రెడీ..!

పుష్ప 2 కథ, కథనాలతో సుకుమార్, నటనతో అల్లు అర్జున్ మాత్రమే కాదు మ్యూజిక్ తో దేవి శ్రీ ప్రసాద్ కూడా ఒక రేంజ్ సెట్ చేయాలని చూస్తున్నారట.

By:  Tupaki Desk   |   26 Jan 2024 9:30 AM GMT
దేవి కూడా వీర లెవెల్ మోతకు రెడీ..!
X

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ రెండేళ్ల క్రితం పుష్ప 1 తో తన మ్యూజిక్ స్టామినా ఏంటో చూపించాడు. అంతకుముందు కొన్నాళ్లుగా దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్న సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే పుష్ప 1 తో దేవి తన విశ్వరూపం చూపించాడు.

సుకుమార్ కాంబోలో తను చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కాగా స్నేహితుడు సుక్కు సినిమాతోనే తను తిరిగి ఫాంలోకి వచ్చాడు డి.ఎస్.పి. అయితే పుష్ప 1 తర్వాత మళ్లీ దేవి శ్రీ ప్రసాద్ వరుస సినిమాలు చేశాడు కానీ అవేవి అంతగా ఆకట్టుకోలేదు. మళ్లీ పుష్ప 2 తోనే మరోసారి దేవి సత్తా చాటాలని చూస్తున్నాడు.

సుకుమార్ అల్లు అర్జున్ మాత్రమే కాదు పుష్ప 2 కోసం దేవి కూడా కష్టపడుతున్నాడు. పుష్ప 1 సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలాగైతే ఆడియన్స్ కు పూనకాలు వచ్చేలా చేశాడో పుష్ప 2 కోసం కూడా అదే రేంజ్ మ్యూజిక్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు డి.ఎస్.పి. ఈ క్రమంలో పుష్ప 2 కి కూడా దేవి వీర లెవెల్ మోత మోగించడం గ్యారెంటీ అని చెబుతున్నారు.

పుష్ప 2 కథ, కథనాలతో సుకుమార్, నటనతో అల్లు అర్జున్ మాత్రమే కాదు మ్యూజిక్ తో దేవి శ్రీ ప్రసాద్ కూడా ఒక రేంజ్ సెట్ చేయాలని చూస్తున్నారట. అందుకే దేవి మిగతా సినిమాలేవి పట్టించుకోకుండా కేవలం పుష్ప 2 మీదే ఫుల్ ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది. పుష్ప 2 తో దేవి మరోసారి తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. ఇక సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ కోసం కూడ దేవి దుమ్ము దులిపేస్తున్నాడని తెలుస్తుంది.

పుష్ప 2 సుకుమార్, అల్లు అర్జున్ మాత్రమే కాదు దేవి శ్రీ ప్రసాద్ కి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప రాజ్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కోసం తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. మరి పుష్ప 2 కి దేవి ఇచ్చే ఏ రేంజ్ లో మోత మోగిస్తుంది అన్నది రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. పుష్ప 2 తో పాటుగా సూర్య కంగువ సినిమాకు దేవి మ్యూజిక్ అందిస్తున్నాడు. అంతేకాదు చందు మొండేటి నాగ చైతన్య కాంబో సినిమా తండేల్ కు కూడా దేవినే మ్యూజిక్ ఇస్తున్నాడు.