Begin typing your search above and press return to search.

దేవిశ్రీ తమ్ముడు.. వేరు కుంపటి..!

సౌత్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ రెండు దశాబ్దాలకు పైగా తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్నాడు

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:27 AM GMT
దేవిశ్రీ తమ్ముడు.. వేరు కుంపటి..!
X

సౌత్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ రెండు దశాబ్దాలకు పైగా తన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తున్నాడు. సినిమా కాన్సెప్ట్ ఎలాంటిదైనా తన మ్యూజిక్ తో తన రేంజ్ పెంచి ఆడియన్స్ కు సినిమాను రీచ్ అయ్యేలా చేసే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే పిచ్చెక్కిపోతుంటారు. దేవి తో మొదలైన తన సంగీత ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూ వస్తున్నాడు డిఎస్పీ. కొన్నిసార్లు మ్యూజిక్ అంచనాలకు మించి సక్సెస్ అవుతుంది. కొన్నిసార్లు అదే మ్యూజిక్ పై విమర్శలు వస్తాయి. ఏది వచ్చినా ఎలా వచ్చినా ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ తో మళ్లీ మళ్లీ కొత్త మ్యూజిక్ తో వారిని అలరించాలని చూస్తాడు దేవి శ్రీ ప్రసాద్.

ఇక టాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న డీఎస్పీ తనతో పాటు తన తమ్ముడు సాగర్ ని కూడా ఎంకరేజ్ చేశాడు. తన మ్యూజిక్ కంపోజ్ చేసే ప్రతి సినిమాలో తమ్ముడు సాగర్ తో ఒక సాంగ్ పాడిస్తూ వచ్చాడు సాగర్. అతని వాయిస్ కి కూడా సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. అయితే అన్న దగ్గర ఇన్నాళ్లు పాటలు పాడుతూ వచ్చిన సాగర్ ఇప్పుడు సొంతంగా ఎదగాలని అనుకుంటున్నాడు. దేవి శ్రీ నుంచి బయటకు వచ్చి సాగర్ సొంతంగా మ్యూజిక్ కంపోజింగ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ క్రమంలోనే తన ఫస్ట్ ప్రాజెక్ట్ ని సైన్ చేశాడని తెలుస్తుంది. రమేష్ వర్మ డైరెక్షన్లో రాబోతున్న శివోహం సినిమాకు సాగర్ మ్యూజిక్ అందించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు మ్యూజిక్ చాలా బలం కానుందని టాక్. మొదటి సినిమానే ఒక భారీ ప్రాజెక్ట్ ని ఎంచుకున్నాడు సాగర్. ఆల్రెడీ రమేష్ వర్మ చేసిన రాక్షసుడు సినిమాకు డైలాగ్స్ అందించాడు సాగర్. సింగర్ గానే కాదు తనలోని మల్టీ టాలెంట్ ని సమయం వచ్చినప్పుడు బయట పెడుతూ వస్తున్నాడు సాగర్.

ఇక లేటెస్ట్ గా సొంతంగా మ్యూజిక్ కంపోజింగ్ ని మొదలు పెట్టాడు సాగర్. అయితే అన్నయ్యతో విభేభాలు వచ్చి ఆయన నుంచి దూరం అవడం కాకుండా ఆయన కూడా తనకు వచ్చిన ఛాన్స్ ని సపోర్ట్ చేయడం వల్లే సాగర్ బయటకు వచ్చి సొంతంగా మ్యూజిక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సాగర్ సంగీత దర్శకుడిగా క్లిక్ అయ్యే వరకు దేవి శ్రీ ప్రసాద్ అండ కూడా ఉంటుందని చెపొచ్చు.