Begin typing your search above and press return to search.

దేవిశ్రీ ముందు ఇన్ని సినిమాలా.. పెద్ద పరిక్షే..

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్

By:  Tupaki Desk   |   19 Jan 2024 4:30 PM GMT
దేవిశ్రీ ముందు ఇన్ని సినిమాలా.. పెద్ద పరిక్షే..
X

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. చిన్న వయస్సులోనే స్టార్ హీరోలందరికి మ్యూజిక్ చేసే అవకాశం సొంతం చేసుకోవడంతో పాటు దశాబ్దానికి పైగా తన మ్యూజిక్ తో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని తెలుగు, తమిళ్ భాషలలో అందించారు. ఇప్పటికి కొన్ని సినిమాలలో సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.

పుష్ప సాంగ్స్ తో దేశం మొత్తం తన వైపు చూసేలా దేవిశ్రీ ప్రసాద్ చేసుకున్నారు. ఇప్పటికి పుష్ప సాంగ్స్ దేశంలో ఏదో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ నుంచి వాల్తేర్ వీరయ్య గత ఏడాది ఆరంభంలో వచ్చింది. ఈ మూవీ తర్వాత ఇంకెలాంటి సినిమాలు రాలేదు. అయితే ఈ ఏడాది మాత్రం దేవిశ్రీ ప్రసాద్ నుంచి పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.

అందులో పుష్ప 2 మూవీ ఒకటి హై ఎక్స్ పెక్టేషన్ ప్రాజెక్ట్ గా ఉంది. ఈ సినిమాలో సాంగ్స్ పుష్పకి మించి ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా లెవల్ లోనే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. అలాగే తమిళంలో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కంగువ మూవీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతోంది. ఈ సినిమాపై చాలా హోప్స్ ఉన్నాయి. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఒకటి సెట్స్ పైన ఉంది.

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ తండేల్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కాంబోలో తెరకెక్కబోయే సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ అయ్యారు. శేఖర్ కమ్ములకి దేవిశ్రీ ప్రసాద్ మొదటి సారి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్స్ ఈ ఏడాది దేవిశ్రీ ప్రసాద్ నుంచి వస్తున్నాయి.

ఈ సినిమాలు చాలా వరకు ఇండియన్ వైడ్ గా అతని బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసేవే కావడం విశేషం. గ్యాప్ తీసుకొని చేస్తోన్న సినిమాలు కావడంతో కచ్చితంగా నెక్స్ట్ లెవల్ లో ఉంటాయనే అభిప్రాయం ఉంది.