Begin typing your search above and press return to search.

'డెవిల్' ట్రైలర్.. ఆపరేషన్ టైగర్ హంట్

ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. 'ఏజెంట్ డెవిల్ కి కనెక్ట్ చేయండి' అంటూ ఓ బ్రిటిష్ అధికారి ఫోన్ లో మాట్లాడడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 12:47 PM GMT
డెవిల్ ట్రైలర్.. ఆపరేషన్ టైగర్ హంట్
X

నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'డెవిల్'. పీరియాడికల్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటీస్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఈ మూవీతో కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ సినిమాను నిర్మించడంతోపాటు దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ ని అందుకోగా నేడు డెవిల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.


ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. 'ఏజెంట్ డెవిల్ కి కనెక్ట్ చేయండి' అంటూ ఓ బ్రిటిష్ అధికారి ఫోన్ లో మాట్లాడడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. సముద్రంలో ఓ షిప్ పై సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఫైట్ సీన్ తో ఉంటుంది. ఆ తర్వాత 'ఓ మర్డర్ కేస్ ని పరిశీలించడానికి మద్రాస్ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు' అంటూ కళ్యాణ్ రామ్ ని చూపించారు.

అక్కడి నుంచి కళ్యాణ్ రామ్ తన ఇన్వెస్టగేషన్ స్టార్ట్ చేయడం, ఆ సమయంలో హీరోయిన్ ని చూస్తాడు. ఆ తర్వాత కొన్ని మిస్టీరియర్స్ షాట్స్ చూపించి సినిమాపై అంచనాలను పెంచేశారు. అనంతరం ఓ బ్రిటిష్ అధికారి కళ్యాణ్ రామ్ కి ఆపరేషన్ టైగర్ హంట్ అనే మిషన్ ని అప్పగిస్తాడు. ఆ తర్వాత చూపించిన యాక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. అంతేకాదు ట్రైలర్ లో ఫ్లాష్ బ్యాక్ షాట్స్ కూడా చూపించారు. ఇందులో కళ్యాణ్ రామ్ లుక్ మరింత డిఫరెంట్ గా కనిపించింది.

కళ్యాణ్ రామ్ ఇందులో సీక్రెట్ ఏజెంట్ తో పాటు మరో పాత్ర కూడా ఉంది. అంటే ఈ మూవీలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశాడా? లేదా ? అనేది రివీల్ చేయలేదు.' శవాలు సాక్షాలు చెప్పడం ఎక్కడైనా చూశారా?..' విశ్వాసంగా ఉండడానికి విధేయతతో బతకడానికి కుక్కని అనుకున్నావ్ రా.. లయన్' అంటూ కళ్యాణ్ మీసం మెలేస్తూ చెప్పే డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. ట్రైలర్ లోని విజువల్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి.

బ్రిటిష్ టైములో మర్డర్ ఇన్వెస్టిగేషన్ అనే కాన్సెప్ట్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. మొత్తంగా డెవిల్ ట్రైలర్ సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. బింబిసార తర్వాత మళ్లీ డెవిల్ తో కళ్యాణ్ రామ్ కి సక్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. డిసెంబర్ 29న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.