Begin typing your search above and press return to search.

డెవిల్ బాక్సాఫీస్.. ఫస్ట్ డే ఎంతంటే?

ఇక మొదటి రోజు ఈ సినిమా 4.92 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తూ ఒక అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 9:49 AM GMT
డెవిల్ బాక్సాఫీస్.. ఫస్ట్ డే ఎంతంటే?
X

నందమూరి కళ్యాణ్ రామ్ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ సినిమాలుతో తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ను హైలైట్ చేసే తన క్రేజ్ అయితే పెంచుకుంటున్నాడు. అంతేకాకుండా ప్రతి క్యారెక్టర్ లో కూడా అతడు తనలోని నటుడిని బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.


బింబిసార సినిమాతోనే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు సొంతం చేసుకున్న ఈ నందమూరి హీరో ఇప్పుడు డెవిల్ క్యారెక్టర్ తో కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉన్నాడు. ఈ సినిమాను ఎనౌన్స్ చేసినప్పటి నుంచే ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఇక ఆ తర్వాత వరుస అప్డేట్స్ తో కూడా మెల్లమెల్లగా పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగాయి.

మొదట అనుకున్న దర్శకుడి అంశం కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినప్పటికీ ఫైనల్గా నిర్మాత ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో అంత క్లియర్ అయ్యింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో అని అందరు ఎదురుచూస్తున్న సమయంలో మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. డెవిల్ సినిమాను అభిషేక్ పిక్చర్స్ పై అభిషేక్ నిర్మాణంలో రూపొందించారు.

ఇక ఆయనే ఈ సినిమాకు దర్శకత్వం వహించినట్లుగా తెలియజేసిన విషయం తెలిసిందే. ఇక మొదటి రోజు ఈ సినిమా 4.92 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తూ ఒక అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేసింది. కళ్యాణ్ రామ్ కెరియర్ లో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్ అందుకున్న సినిమాల్లో కూడా డెవిల్ ఒకటిగా నిలిచింది.

ఇక ఈవారం ఈ సినిమాకు పోటీగా అయితే మరే పెద్ద సినిమాలు విడుదల కాలేదు. ముందే సలార్ వచ్చింది కాబట్టి ఆ సినిమా కలెక్షన్స్ మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక డెవిల్ మంచి టాక్ అయితే సొంతం చేసుకుంది. శనివారం ఆదివారం కలెక్షన్స్ పెరిగితే ప్రాఫిట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సినిమా 45 కోట్ల బడ్జెట్తో నిర్మించినట్లు నిర్మాత అభిషేక్ తెలియజేశారు. నాన్ థియేట్రికల్ గానే ఈ సినిమా దాదాపు 20 కోట్లను వెనక్కి తీసుకువచ్చింది. ఇక థియేట్రికల్ బిజినెస్ లో డెవిల్ సినిమా మరొక 20 కోట్లు వెనక్కి తీసుకువస్తే సక్సెస్ అయినట్లు లెక్క. మరి ఆ టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.