Begin typing your search above and press return to search.

గోల్డెన్ పాపతో నందమూరి డెవిల్!

ఇప్పుడు మేకర్స్ రెండవ సింగిల్ "దిస్ ఈజ్ లేడీ రోజ్" ప్రోమోను రిలీజ్ చేశారు. ఇటీవల గ్లోబల్ హిట్ గా నిలిచిన జవాన్ థీమ్‌ను పాడిన రాజకుమారి ఈ సిజ్లింగ్ సాంగ్ ను పాడారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 2:24 PM GMT
గోల్డెన్ పాపతో నందమూరి డెవిల్!
X

నందమూరి కళ్యాణ్ రామ్ ఎలాంటి సినిమా చేసిన అందులో ఏదో ఒక పాయింట్ చాలా కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. తన కెరీర్ ప్రారంభం నుండి విలక్షణమైన స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ వస్తున్న ఈ టాలెంటెడ్ హీరో నెక్స్ట్ డెవిల్ అనే మరో స్పై డ్రామా సినిమాతో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు. బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ఈ సినిమాకు ట్యాగ్ లైన్ గా సెట్ చేశారు.


ఈ చిత్రానికి నిర్మాత అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. ఇక సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. దాంతోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. మొదటి సింగిల్, మ్యాజికల్ మెలోడీగా ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ రెండవ సింగిల్ "దిస్ ఈజ్ లేడీ రోజ్" ప్రోమోను రిలీజ్ చేశారు. ఇటీవల గ్లోబల్ హిట్ గా నిలిచిన జవాన్ థీమ్‌ను పాడిన రాజకుమారి ఈ సిజ్లింగ్ సాంగ్ ను పాడారు.

రాజా కుమారి పాడిన ఈ పాటకు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచగా, శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించారు. ఇక లేడీ రోజ్ గా బాలీవుడ్ సంచలనం ఎల్నాజ్ నొరౌజీ కనిపించింది. సిల్క్ మినీ డ్రెస్‌లో ఆమె గ్లామరస్ డ్యాన్స్‌లో రెట్రో వైబ్‌ని క్రియేట్ చేస్తోంది. అంతే కాకుండా ఒక స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అందులో కళ్యాణ్ రామ్ వింటేజ్ సూట్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక గోల్డెన్ డ్రెస్సులో ఎల్నాజ్ చూపులతోనే హీటెక్కించేలా స్టిల్ ఇచ్చింది.

ఇక పూర్తి పాట నవంబర్ 27న విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇక అభిషేక్ పిక్చర్స్ ఇప్పటికే కొన్ని సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంది. వారి అద్భుతమైన నిర్మాణా విలువలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు డెవిల్ సినిమాను కూడా అంచనాలకు తగ్గట్టుగా తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ వర్క్ చేయగా సౌందర్ రాజన్.ఎస్ సినిమాటోగ్రఫీ అందించారు. తమ్మిరాజు ఎడిటింగ్ వెండితెరపై కథకు ప్రాణం పోస్తాయని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా అలాగే అతని టీమ్ స్క్రీన్‌ప్లే డైలాగ్‌లను అందించారు. ఇక సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.