కమెడియన్‌పై వంద కోట్ల దావా!
కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సంతానం ప్రస్తుతం హీరోగా మారి వరుస కామెడీ థ్రిల్లర్‌లు చేస్తున్నాడు.
By: Tupaki Desk | 14 May 2025 6:41 PM ISTఈ మధ్య సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టాలన్నా క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఫుల్ క్లారిటీ వచ్చాకే సెలబ్రిటీలు కానీ, సాధారణ పౌరులు కానీ పోస్ట్‌లు పెట్టాల్సి వస్తోంది. ఇక సినిమాల్లోనూ ఓ వర్గాన్ని కించపరడం కానీ, అలాంటి అనుమానాలు రేకెత్తించడం కానీ చేస్తే దర్శకనిర్మాతలు, హీరోలపై కేసులు వేయడం, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నటీనటులకు, మేకర్స్‌కు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి.
ఆ మధ్య విడుదలైన 'కాంతార' మూవీలోని 'వరాహ రూపం' అంటూ సాగే పాటలోని పదాలు, సంగీతాన్నికేరళకు చెందిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ నుంచి కాపీ చేశారంటూ సదరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇక గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై మలయాళ ఇండస్ట్రీలో రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన 'మంజిమల్ బాయ్స్'పై మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కేసు వేయడం, తన పాటకు అనుమతి లేకుండా వాడుకున్నారని, దీనికి తనకు నష్టపరిహారం కట్టించాలని డిమాండ్ చేయడం తెలిసిందే.
తాజాగా ఇలాంటి వివాదమే కమెడియన్ సంతానం ఎదుర్కొంటున్నాడు. కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సంతానం ప్రస్తుతం హీరోగా మారి వరుస కామెడీ థ్రిల్లర్‌లు చేస్తున్నాడు. సంతానం చేసిన కామెడీ హీరర్ థ్రిల్లర్ 'డీడీ రిటర్న్స్'. ఇది విజయం సాధించడంతో ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్' చేశాడు. తెలుగు ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లితో కలిసి హీరో ఆర్య ఈ మూవీని నిర్మించారు. ఈ నెల 16న రిలీజ్ అవుతోంది. దీంతో టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్‌ని ప్రారంభించింది.
ఈ మూవీలోని 'కిస్సా47' అనే పాటలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని కీర్తించే డివోషనల్ సాంగ్ 'శ్రీనివాస గోవిందా'ని వెస్ట్రన్ స్టైల్లో మార్చి వాడారట. దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు టీడీపీ లీడర్ భానుప్రకాష్‌రెడ్డి. అంతే కాకుండా ఐకానిక్ డివోషనల్ సాంగ్‌ని ఇలా కించపరచడందారుణమని మూవీ టీమ్‌పై మండిపడ్డారు. అంతే కాకుండా హీరో సంతానంతో పాటు మేకర్స్ వంద కోట్లు చెల్లించాలని, దీనిపై దావా వేస్తామని ఫైర్ అయ్యారు. దీంతో తెలుగు ప్రపొడ్యూసర్ ప్రపొడ్యూస్ చేసిన ఈ సినిమా చుట్టూ వివాదం మొదలైంది.
