Begin typing your search above and press return to search.

డెవిల్.. బాక్సాఫీస్ వద్ద ఎంత రావాలంటే..

కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా నిర్మాణం, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ డెవిల్

By:  Tupaki Desk   |   29 Dec 2023 4:46 AM GMT
డెవిల్.. బాక్సాఫీస్ వద్ద ఎంత రావాలంటే..
X

కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా నిర్మాణం, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ డెవిల్. ఈ సినిమా ఈ రోజు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ జోనర్ లో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మూవీని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. బ్రిటిష్ ఇండియాలో పనిచేసే గూఢచారిగా కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

బింబిసార తర్వాత ఆ స్థాయి ఎక్స్ పెక్టేషన్స్ తో డెవిల్ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా కళ్యాణ్ రామ్ కెరియర్ లో ఇదొక మంచి మూవీ అవుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. కళ్యాణ్ రామ్ కూడా డెవిల్ కోసం ప్రాణం పెట్టి వర్క్ చేసినట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధమైపోతోంది.

రిలీజ్ కి ముందు ఈ సినిమా డైరెక్షన్ క్రెడిట్ విషయంలో కొంత కాంట్రవర్సీ నడిచింది. అయితే ఇప్పటికే బిజినెస్ కంప్లీట్ కావడంతో ఆ ఇంపాక్ట్ సినిమాపైన పడలేదు. ఇదిలా ఉంటే ఈ మూవీ నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే 20 కోట్ల షేర్ వచ్చేసింది. ప్రీరిలీజ్ బిజినెస్ 20 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఇమేజ్ కి ఈ 20 కోట్లు పెద్ద టార్గెట్ అయితే కాదు.

అయితే ఈ మధ్యకాలంలో సినిమా ఎంతో అద్భుతంగా ఉంది అంటేనే తప్ప థియేటర్స్ లో ఆడియన్స్ చూడటం లేదు. ఎవరేజ్ టాక్ వచ్చిన కూడా చూడటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూసుకోవచ్చని అనుకుంటున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఎవరేజ్ మూవీస్ రావడం లేదు. అయితే హిట్ లేదంటే కమర్షియల్ ఫ్లాప్ అనే టాక్ మాత్రమే తెచ్చుకుంటున్నాయి.

ప్రస్తుతం థియేటర్స్ లో ప్రభాస్ సలార్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అంతకు మించి అనేంతగా డెవిల్ మూవీ ఇంపాక్ట్ చూపిస్తే సినిమాకి సాలిడ్ కలెక్షన్స్ రావడం గ్యారెంటీ. మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 21 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు. మరి కళ్యాణ్ రామ్ ఈ టార్గెట్ ని అందుకోగాలడా అనేది చూడాలి.