Begin typing your search above and press return to search.

'డెవిల్‌'.. గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్‌

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కళ్యాణ్‌ రామ్‌ 'డెవిల్‌' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 5:41 AM GMT
డెవిల్‌.. గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్‌
X

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కళ్యాణ్‌ రామ్‌ 'డెవిల్‌' సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సలార్‌ విడుదల అయ్యి వారమే అయినా కూడా డెవిల్‌ చాలా డేరింగ్ గా రిలీజ్ కు సిద్ధం అయ్యాడు. కంటెంట్‌ బాగుంటే కచ్చితంగా ఎంత పెద్ద పోటీ ఉన్నా తట్టుకోవచ్చు అని డెవిల్ సినిమా నిరూపితం చేసింది.

కళ్యాణ్ రామ్‌ డెవిల్‌ సినిమాతో పాజిటివ్‌ టాక్ దక్కించుకున్నాడు. తన పాత్రకు న్యాయం చేయడంతో పాటు, మంచి కథను ఎంపిక చేసుకున్నాడని, అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాకు పాజిటివ్ టాక్‌ వచ్చే విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు అంటూ రివ్యూవర్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో హిట్ సినిమాలకు, మంచి కాన్సెప్ట్‌ సినిమాలకు పార్ట్‌ 2 లు వస్తున్న విషయం తెల్సిందే. డెవిల్‌ సినిమా కూడా రెండో పార్ట్‌ కి అర్హం అంటూ మేకర్స్‌ భావిస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ కూడా డెవిల్‌ పార్ట్‌ 2 వస్తే బాగుంటుందనే అభిప్రాయం ను వ్యక్తం చేశారు. అందుకే మేకర్స్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్ చెప్పారు.

డెవిల్‌ సినిమా సీక్వెల్‌ ఉంటుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది. అంతే కాకుండా సినిమా సీక్వెల్‌ మొదటి పార్ట్ కంటే రిచ్‌ గా కూడా ఉంటుంది అంటూ మేకర్స్ ప్రకటించారు. డెవిల్‌ సినిమా కు సీక్వెల్‌ తీయాలి అనే ఆలోచన మంచి నిర్ణయం అన్నట్టు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్‌, సంయుక్త మీనన్‌ జంటగా నటించిన డెవిల్‌ సినిమా దర్శకుడి వివాదం విడుదలకు ముందు కాస్త టెన్షన్‌ ను క్రియేట్‌ చేసినా కూడా విడుదల తర్వాత అంతా కూడా సినిమా కంటెంట్‌ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి సీక్వెల్‌ కి ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది చూడాలి.