Begin typing your search above and press return to search.

డైరెక్టర్ గా నిర్మాత పేరు.. డెవిల్ గోలేంటి?

అయితే ఇప్పుడీ సినిమాలో విషయంలో ఓ పెద్ద కన్ఫ్యూజన్, క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. అదేంటంటే ఈ సినిమా అసలు దర్శకుడు ఎవరనేది?

By:  Tupaki Desk   |   13 Sep 2023 8:05 AM GMT
డైరెక్టర్ గా నిర్మాత పేరు.. డెవిల్ గోలేంటి?
X

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ స్పై థ్రిల్లర్ మూవీ 'డెవిల్'. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. నవంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడీ సినిమాలో విషయంలో ఓ పెద్ద కన్ఫ్యూజన్, క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. అదేంటంటే ఈ సినిమా అసలు దర్శకుడు ఎవరనేది?

వివరాళ్లోకి వెళితే.. 'డెవిల్' సినిమాలో సంయుక్తా మేనన్ హీరోయిన్ గా నటిస్తోంది. 'బింబిసార' చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ సరసన ఆమె మరోసారి నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ పోస్టర్ పై ఏ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చర్స్ అని రాసి ఉండటం గమనార్హం. ఇది అందరీ దృష్టిని ఆకర్షించడంతో పాటు ఓ క్వశ్చన్ మార్క్ ను క్రియేట్ చేసింది.

నిజానికి నవీన్ మేడారం దర్శకత్వంలో 'డెవిల్' సినిమా ప్రారంభమైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కూడా పోస్టర్ పై నవీన్ మేడారం పేరు రాసి ఉంది. దర్శకత్వ పర్యవేక్షణగా అభిషేక్ పిక్చర్స్ ఉంది. మొదట ఈ సినిమాకు కథ రచయిత శ్రీకాంత్ విస్సా, దర్శకుడు నవీన్ మేడారం కలిసి పని చేశారు. స్టోరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని ఇద్దరు కలిసి చూసుకున్నారు. కొద్ది రోజులు తర్వాత క్రమక్రమంగా స్క్రీన్ ప్లే, దర్శకుడిగా నవీన్ మేడారం పేరు పడింది. ఆ తర్వాత మళ్లీ కొద్ది రోజులకు స్క్రీన్ ప్లే మాయమై.. కేవలం దర్శకుడిగా మాత్రమే ఉంది.

ఇప్పుడు ఆ డైరెక్టర్ టైటిల్ కార్డు కూడా పోయి.. అసలు నవీన్ మేడారం పేరే కనిపించలేదు. మొత్తానికి నవీన్ పేరు మాయమైంది. దర్శకుడిగా అభిషేక్ నామా వచ్చింది. దీంతో నిర్మాత అభిషేక్ నామాకు.. దర్శకుడు నవీన్ మేడారంకు మధ్య విభేధాలు ఏమైనా వచ్చాయా అని అందరూ సందేహ పడుతున్నారు. నిజానికి 'డెవిల్' కన్నా ముందు అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో 'బాబు బాగా బిజీ' కోసం వర్క్ చేశారు నవీన్ మేడారం. అప్పుడు అభిషేక్ నామా, నవీన్ కు మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. మరి, 'డెవిల్' సమయంలో ఏమైనా జరిగిందా అనేది క్లారిటీ లేదు. నవీన్ తనంతట తానే బయటకు వచ్చాడా లేదా తొలిగించారా అనేది తెలియట్లేదు.

రీసెంట్ గా కూడా నిర్మాత అభిషేక్ నామా పేరు మరో వివాదంలో బాగా వినిపించింది. 'ఖుషి' రిలీజ్ సమయంలోనూ విజయ్ దేవరకొండ కోటి రూపాయలు డొనేట్ చేస్తానని అనౌన్స్ చేస్తే.. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాను లేవనెత్తి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు అభిషేక్ నామా. అప్పుడు ఆయన పేరు హాట్ టాపిక్ గా మారగా.. ఇప్పుడు మరోసారి దర్శకుడు పేరు తీసేసి తననే దర్శకుడిగా ప్రకటించుకోవడంతో మరోసారి అభిషేక్ నామా పేరు వార్తల్లో నిలిచింది.