Begin typing your search above and press return to search.

'డెవిల్' కలెక్షన్స్ డే1 కన్నా డే4 ఎక్కువ..!

ప్రభాస్ సలార్ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతుండటంతో అది కాస్తా డెవిల్ కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 11:57 AM GMT
డెవిల్ కలెక్షన్స్ డే1 కన్నా డే4 ఎక్కువ..!
X

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా 'డెవిల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ సినిమాని నిర్మించడంతోపాటు దర్శకత్వం వహించారు. డిసెంబర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంది. మొదటి రోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ప్రభాస్ సలార్ బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతుండటంతో అది కాస్తా డెవిల్ కలెక్షన్స్ పై ప్రభావం చూపించింది.


అయితే రెండో రోజు నుంచి డెవిల్ కలెక్షన్స్ ఊపందుకున్నాయి. సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫామెన్స్ ట్విస్టులు, సెకండాఫ్ ని నడిపించిన తీరు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. సినిమా కంటెంట్ ఆడియన్స్ కి మెల్లగా ఎక్కుతోంది. దాంతో రెండో రోజు నుంచి ఆడియన్స్ నుండి మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో కలెక్షన్స్ కూడా పెరిగాయి. డే1 కన్నా డే2, డే2 కన్నా డే3, డే3 కంటే డే4.. ఇలా రోజు రోజుకి కలెక్షన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది.

ఫైనల్ గా డెవిల్ కి మొదటి రోజు కంటే నాలుగో రోజు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. ఇదే ఊపు కొనసాగిస్తూ మరో వారం రోజులపాటు డెవిల్ థియేటర్స్ లో నిలిస్తే ఖచ్చితంగా మూవీ బ్రేక్ ఈవెన్ అవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.రూ.21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా రూ.43 కోట్ల గ్రాస్ ని రాబడితే బ్రేక్ ఈవెన్ అయినట్లే. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా రూ.22.59 కోట్ల గ్రాస్ ని రాబట్టింది.

ఇలానే కొనసాగితే మరికొన్ని రోజుల్లో సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్లే. మరోవైపు నాన్ థియేట్రికల్ గా డెవిల్ నిర్మాతలకు రూ.20 కోట్లకు పైగా లాభాల్ని అందించింది. ఇప్పుడు థియేట్రికల్ గా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది. మరోవైపు ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని కళ్యాణ్ రామ్ ఇటీవల కన్ఫర్మ్ చేశారు.

'డెవిల్‌ 2'ను తెరకెక్కించాలన్న ఆలోచన మాకు ఎప్పటి నుంచో ఉందని, కారైకుడిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మూవీ రైటర్ శ్రీకాంత్‌ విస్సా 'డెవిల్‌ 2' ఐడియాను చెప్పగానే అది నాకు ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించిందని, ఇందులో 1940తో పాటు ప్రస్తుతం ఉన్న కాలాన్ని కూడా చూపించనున్నాం.. అని చెప్పారు.