Begin typing your search above and press return to search.

డెవిల్.. మాయ చేయడానికి కారణమిదే

ఈ చిత్రం స్వాతంత్ర్యం రాక ముందు, పీరియాడిక్ డ్రాప్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే సినిమాలోని లొకేషన్స్, కాస్ట్యూమ్స్, బ్యాక్ గ్రౌండ్ వాతావరణం ఉండేలా చూసుకుంటున్నారు మేకర్స్.

By:  Tupaki Desk   |   22 Sep 2023 3:49 PM GMT
డెవిల్.. మాయ చేయడానికి కారణమిదే
X

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం డెవిల్. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. రీసెంట్​గా ఈ సినిమా నుంచి మాయే చేశావే అనే సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ పాట శ్రోతలను బాగానే ఆకట్టుకుంది. ప్రేక్షకుల హృదయాల్ని తట్టింది. నాటి కాలంలోకి తీసుకెళ్లిందీ ఈ రెట్రో మ్యూజిక్. అయితే తాజాగా.. ఈ పాట కోసం ఉపయోగించిన వాయిద్యాల వివరాలు తెలిశాయి. వాటిని వినియోగించడం వల్లే శ్రోతలను నాటి కాలంలోని తీసుకెళ్లగలిగారిని అర్థమవుతోంది.


వివరాళ్లోకి వెళితే.. ఈ చిత్రం స్వాతంత్ర్యం రాక ముందు, పీరియాడిక్ డ్రాప్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టే సినిమాలోని లొకేషన్స్, కాస్ట్యూమ్స్, బ్యాక్ గ్రౌండ్ వాతావరణం ఉండేలా చూసుకుంటున్నారు మేకర్స్. అలాగే రీసెంట్ గా రిలీజైన మాయే చేశావే మెలోడీ సాంగ్​ను కూడా చిత్రీకరించారు. ఈ పాటను చిత్రీకరించిన విధానం, అందించిన సంగీతం అంతా పీరియాడిక్ వాతావరణాన్ని తలపిస్తూ బాగానే ఉంది. ఈ పాట వింటున్నప్పుడు ప్రేక్షకులు, శ్రోతలు ఓ అందమైన ఫీల్​కు లోనయ్యేలానే ఉంది.


ఇంకా చెప్పాలంటే నాటి కాలాన్ని, నాటి సంగీతాన్ని ప్రతి ప్రేక్షకుడు ఆస్వాదించేలా.. దక్షిణ భారత దేశపులోని సహజమైన లొకేషన్లలో షూట్ చేశారు. కారైకుడిలోని ప్యాలెస్‌లో ఈ పాటను షూట్ చేశారు. అప్పటి కాలంలోకి తీసుకెళ్లేందుకు సంగీతం చాలా బాగా ఉపయోగపడింది. దర్శక నిర్మాత అభిషేక్ నామా, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ ద్వయం కలిసి ఈ వింటేజ్ సాంగ్‌ను క్రియేట్ చేశారు.


అయితే ఈ పాట కోసం విదేశాల నుంచి తెప్పించిన రకరకాల వాయిద్యాలు వాడారని తెలిసింది. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు.. చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా.. దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్.. .వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్.. సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్.. మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్.. ఇలా రకరకాల వాయిద్యాలను ఈ సాంగ్ మ్యూజిక్ కోసం వినియోగించడం విశేషం. వీటన్నింటినీ ఉపయోగించడం వల్లే శ్రోతలను నాటి కాలానికి, వింటేజ్ మూడ్‌లోకి తీసుకెళ్లడం సాధ్యమైంది.


ఈ పాటను ప్రముఖ సింగర్ సిద్ధ్ శ్రీరామ్ పాడారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ రెట్రో ట్రాక్‌ను అందించారు. ఈ పాటలో కళ్యాణ్ రామ్, సంయుక్త మధ్య కెమిస్ట్రీ బాగుంది. ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ వేసిన సెట్స్ విజువల్ రిచ్​నెస్​ను చూపిస్తున్నాయి. సౌందర్ రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా టీజర్‌కు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. నందమూరి అభిమానులు కూడా సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్రం నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.