Begin typing your search above and press return to search.

పుష్ప 2లో దేవి శ్రీ తెరంగేట్రం..?

సుకుమార్ అల్లు అర్జున్ కలిసి చేస్తున్న పుష్ప 2 అంచనాలను ఏమాత్రం తగ్గకూడదనేలా తెరకెక్కిస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 May 2024 6:48 AM GMT
పుష్ప 2లో దేవి శ్రీ తెరంగేట్రం..?
X

సుకుమార్ అల్లు అర్జున్ కలిసి చేస్తున్న పుష్ప 2 అంచనాలను ఏమాత్రం తగ్గకూడదనేలా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ కూడా సినిమా మీద ఉన్న అంచనాలకు తగినట్టుగానే బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. పుష్ప 2 తో సుకుమార్ అల్లు అర్జున్ చాలా పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొన్ని సర్ ప్రైజ్ లు ఆడియన్స్ ని ఫుల్ ఖుషి చేస్తాయని అంటున్నారు. ఆగష్టు 15న థియేటర్లు దద్దరిల్లిపోవడం పక్కా అని అంటున్నారు.

పుష్ప 2 లో ఒక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ గా దేవి శ్రీ ప్రసాద్ తెరంగేట్రం ఉంటుందని టాక్. సినిమాలో కొద్ది నిమిషాల పాటు ఉండే ఒక కీలక పాత్రలో దేవి శ్రీ ప్రసాద్ ని ఫిక్స్ చేశాడట సుకుమార్. దేవికి కూడా నటన మీద ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. పుష్ప 2 లో నటిస్తే చేసిన చిన్న పాత్రకైనా మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్నాడట దేవి శ్రీ ప్రసాద్. అందుకే సుకుమార్ ఇచ్చిన ఆఫర్ ని కాదనకుండా ఓకే చెప్పేశాడట.

అల్లు అర్జున్ ఆల్రెడీ పుష్ప రాజ్ గా మరోసారి పూనకాలు తెప్పించడానికి రెడీ అవుతుంటే సరైన టైం లో దేవి శ్రీ ప్రసాద్ కూడా ఒక చిన్న క్యామియోతో అదరగొట్టేస్తాడని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది తెలియదు కానీ. సుకుమార్ ఇలా ప్లాన్ చేస్తే మాత్రం పుష్ప 2 కి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ ఒకదాన్ని మించి మరొకటి అనేలా స్కెచ్ లు వేస్తున్నాడు.

టికెట్ కొనుక్కుని థియేటర్ కు వచ్చిన ఆడియన్స్ ను లెక్క సరిపోయేలా సాటిస్ఫై చేసేందుకు సుకుమార్ నెక్స్ట్ లెవెల్ లో ప్లానింగ్ చేస్తున్నాడట. ఎలాగు తన మ్యూజిక్ తో సినిమాకు కావాల్సినంత హై ఇచ్చే దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 2 లో చిన్న పాత్రతో మరో సర్ ప్రైజ్ ఇస్తాడని అంటున్నారు. పుష్ప 2 కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ అంతా ఒక రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి. రీసెంట్ గా పుష్ప 2 నుంచి వచ్చిన పుష్ప పుష్ప సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. త్వరలోనే సినిమా లోని సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.