Begin typing your search above and press return to search.

దేవి, థమన్.. పోటీగా ఒకడొచ్చాడు

టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలు అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ గా దేవిశ్రీప్రసాద్ లేదా థమన్ పేర్లు వినిపిస్తూ ఉంటాయి.

By:  Tupaki Desk   |   10 April 2024 4:15 AM GMT
దేవి, థమన్.. పోటీగా ఒకడొచ్చాడు
X

టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలు అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ గా దేవిశ్రీప్రసాద్ లేదా థమన్ పేర్లు వినిపిస్తూ ఉంటాయి. మేగ్జిమమ్ తెలుగులో స్టార్ హీరోల సినిమాలని వీరిద్దరే చేస్తున్నారు. థమన్ నుంచి రెగ్యులర్ ట్యూన్స్, బీట్స్ వచ్చినా కూడా స్టార్ హీరోలు నమ్మకంతో మ్యానేజ్ చేయగలడు అని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అయితే సెలక్టివ్ గా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే ప్రస్తుతం చేస్తున్నాడు.


మిక్కీ జె మియర్, అనూప్ రూబెన్స్ లాంటి వారు ఉన్న కూడా వారికి స్టార్ హీరోలతో చేసే ఛాన్స్ లు రావడం లేదు. కొంతమంది కొత్త టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా ప్రూవ్ చేసుకునే దశలో ఉన్నారు. ఇక సీనియర్లలో మణిశర్మ ఇంకా పూర్తి స్థాయిలో ఫామ్ లోకి రావడం లేదు. కీరవాణి కూడా చిన్న సినిమాలు సైతం చేస్తున్నప్పటికీ ఆయన మ్యూజిక్ జక్కన్న సినిమాలకు తప్పితే మిగతా వాటిలో అంతగా క్లిక్ కావడం లేదు.

దీంతో థమన్, దేవిశ్రీ కాకుండా అంటే ఇతర భాషలలో మ్యూజిక్ డైరెక్టర్స్ ని కొంతమంది దర్శకులు ఎంపిక చేసుకుంటున్నారు. అనిరుద్, జీవీ ప్రకాష్ కుమార్, గోపిసుందర్, రవి బసూర్, అజనీష్ లోకనాథ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ హవా ప్రస్తుతం నడుస్తోంది. అయితే వీళ్ళు అన్ని భాషల్ని మ్యానేజ్ చేయడంతో తెలుగులో సెలక్టివ్ గానే సినిమాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కమర్షియల్ మాస్ సినిమాలకి దేవిశ్రీ, థమన్ కాకుండా ప్రత్యామ్నాయం చాలా రోజుల నుంచి కనిపించలేదు. ఇప్పుడు ఆ ప్లేస్ ని భర్తీ చేసే పనిలో భీమ్స్ సిసిరోలియో ఉన్నారు. గాయకుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన భీమ్స్ కొన్ని హిట్ సాంగ్స్ పాడిన ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

అయితే 2012లో నువ్వా నేనా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. అప్పటి నుంచి అడపాదడపా సినిమాలు చేస్తూనే వస్తోన్న భీమ్స్ కి బ్రేక్ పడింది రవితేజ ధమాకా మూవీతో అని చెప్పాలి. ఈ సినిమా సాంగ్స్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం భీమ్స్ చేతిలో గంజా శంకర్, బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు. అడవి శేష్ డెకాయిట్ మూవీస్ ఉన్నాయి.

వీటితో పాటు రవితేజ కొత్త సినిమాకి భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా కన్ఫర్మ్ అయ్యారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కబోయే సినిమాకి కూడా భీమ్స్ కన్ఫర్మ్ అయ్యాడు. ఈ సినిమాలు అన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. దీంతో దేవిశ్రీ, ప్రసాద్, థమన్ లకి ప్రత్యామ్నాయంగా టాలీవుడ్ లో ఇప్పుడు భీమ్స్ సిసిరోలియో రెడీ అయ్యాడని సినీ విశ్లేషకులు అంటున్నారు.