Begin typing your search above and press return to search.

భ‌గ‌త్ సింగ్ కోసం రాక్ స్టార్ మొద‌లెట్టాడుగా!

ఆల్రెడీ ఈ సినిమాపై అంద‌రికీ మంచి అంచ‌నాలున్నాయి. దానికి ప‌లు కార‌ణాలున్నాయి. ప‌వ‌న్ నుంచి వ‌స్తున్న మాస్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ కావ‌డం ఓ కార‌ణం కాగా, దానికి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం మ‌రో కార‌ణం.

By:  Tupaki Desk   |   29 Jun 2025 11:00 PM IST
భ‌గ‌త్ సింగ్ కోసం రాక్ స్టార్ మొద‌లెట్టాడుగా!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం త‌ను క‌మిట్ అయిన సినిమాల‌న్నింటినీ పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమా షూటింగ్ ను పూర్తి చేసి దాన్ని రిలీజ్ కు రెడీ చేసిన ప‌వ‌న్ రీసెంట్ గానే ఓజి సినిమాను కూడా పూర్తి చేశారు. ఇక మిగిలింది హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా మాత్ర‌మే.


హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, ఓజీ సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా రానుండ‌గా, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా మాత్రం వాటికి భిన్నంగా రీజ‌న‌ల్ మాస్ మూవీగా రాబోతుంది. ఆల్రెడీ ఈ సినిమాపై అంద‌రికీ మంచి అంచ‌నాలున్నాయి. దానికి ప‌లు కార‌ణాలున్నాయి. ప‌వ‌న్ నుంచి వ‌స్తున్న మాస్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ కావ‌డం ఓ కార‌ణం కాగా, దానికి హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం మ‌రో కార‌ణం.

ఇప్ప‌టికే వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అనేది అంద‌రికీ తెలిసిన విష‌యమే. ఆ సినిమా త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి మ‌రో సినిమా చేసింది లేదు. మ‌ళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా, ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ ఓ క్రేజీ అప్డేట్ ను అందించారు. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ కోసం మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ వ‌ర్క్స్ ను మొద‌లుపెట్టిన‌ట్టు త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్. హ‌రీష్ పోస్ట్ ను బ‌ట్టి చూస్తుంటే ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ కు సంబంధించిన వ‌ర్క్స్ స్పీడ‌ప్ అయ్యాయ‌ని తెలుస్తోంది. చాలా కాలం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాకు దేవీ శ్రీ మ్యూజిక్ అందిస్తుండ‌టంతో ఈ సినిమాకు నెక్ట్స్ లెవెల్ ఆల్బ‌మ్ ను ఇవ్వాల‌ని దేవీ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాను పూర్తి చేసి వ‌చ్చే ఏడాదిలో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.