రాక్ స్టార్ ఈ కొత్త రూట్‌లోకి వస్తేనే ఛాన్స్
భారీ ఈవెంట్లలో చెదురుముదురు ఘటనలు విశాఖలో గతంలో జరగడంతో పోలీసులు జనాలు గుమిగూడే ఈవెంట్లకు అనుమతులు ఇవ్వడానికి ససేమిరా అనేస్తున్నారు.
By: Tupaki Desk | 17 April 2025 4:00 AM ISTభారీ సినిమా ఈవెంట్లు నిర్వహిస్తే ఎలాంటి ప్రమాదాలు తలెత్తుతాయో అనే ఆందోళన పోలీస్ వర్గాల్లో ఉంటుంది. తప్పు ఎవరు చేసినా ముందుగా రక్షకభటులపైనే అందరూ విరుచుకుపడతారు. అందువల్ల చాలా ఈవెంట్లకు ఇటీవలి కాలంలో పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు నానా తిప్పలు పెడుతున్నారు. ఇంతకుముందు హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లి కుమారుల ధైన్యమైన పరిస్థితిని చూశాక చాలామంది చలించిపోయారు. తల్లి చనిపోగా, పదేళ్ల కొడుకు ఆస్పత్రి పాలవ్వడం కలచి వేసింది.
ఇటీవలే విశాఖ నగరంలో స్పోర్ట్స్ వాటర్ క్లబ్‌లో జరిగిన ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. భారీ ఈవెంట్లలో చెదురుముదురు ఘటనలు విశాఖలో గతంలో జరగడంతో పోలీసులు జనాలు గుమిగూడే ఈవెంట్లకు అనుమతులు ఇవ్వడానికి ససేమిరా అనేస్తున్నారు.
అయితే ఇలాంటి రాంగ్ లైమ్ లో విశాఖలో లైవ్ కాన్సెర్ట్ కోసం రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ పాకులాడుతున్నాడని చెబుతున్నారు. ఇండియా వైడ్ లైవ్ మ్యూజిక్ కాన్సెర్టులతో బిజీబిజీగా ఉన్న దేవీశ్రీ ఇంతకుముందు హైదరాబాద్, బెంగళూరులో భారీ ఈవెంట్లను సక్సెస్ చేసాడు. ఇదే ఊపులో విశాఖలోను భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేయగా, ప్రస్తుత సీపీ (కమీషనర్ ఆఫ్ పోలీస్) నుంచి అనుమతులు మంజూరు కావడం సులువుగా లేదు.
ఇప్పటికే నాలుగు సార్లు అనుమతులను నిరాకరించారని తెలిసింది. ఓవైపు కార్యక్రమానికి సంబంధించిన టికెట్లను జోరుగా విక్రయిస్తున్నారు. ఇలాంటి సమయంలో టూర్ క్యాన్సిల్ అంటే దేవీశ్రీకి ప్రెస్టేజ్ ఇష్యూ. అందువల్ల తన టూర్ ని విశాఖలో ఏదోలా పూర్తి చేయాలని అతడు ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అయితే దీనికి అనుమతులు లభిస్తాయా లేదా? అనేది సస్పెన్స్ గా మారింది.
విశాఖ సీపీ శంకభ్రత భాగ్చి స్ట్రిక్టు ఆఫీసర్ కావడం వల్ల ఇలాంటి పబ్లిక్ ఈవెంట్లు అంత సులభం కాదు. సీసీ శంకభ్రత మంచి డివోటీ. గీతా సారాంశం సహా పురాణాలపై విశిష్ఠమైన విజ్ఞానం ఉన్న అధికారి. దైవ కార్యక్రమాలకు మాత్రం ఆయన నుంచి అనుమతులు లభించడం సులువు. కాబట్టి దేవీశ్రీ ఏదైనా డివోషనల్ మ్యూజిక్ కాన్సెర్ట్ ప్లాన్ చేస్తే బావుంటుందేమోనని అభిమానులు సూచిస్తున్నారు.
