Begin typing your search above and press return to search.

వైరల్ వయ్యారితో మరోసారి దేవి మ్యాజిక్!

టాలీవుడ్‌లో మ్యూజికల్ హిట్స్ అంటే ఎక్కువగా గుర్తొచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ లలో దేవి శ్రీ ప్రసాద్ పేరు టాప్ లిస్టులో ఉంటుంది.

By:  Tupaki Desk   |   16 July 2025 5:26 PM IST
వైరల్ వయ్యారితో మరోసారి దేవి మ్యాజిక్!
X

టాలీవుడ్‌లో మ్యూజికల్ హిట్స్ అంటే ఎక్కువగా గుర్తొచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ లలో దేవి శ్రీ ప్రసాద్ పేరు టాప్ లిస్టులో ఉంటుంది. ఎన్నో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ తో ప్రేక్షకుల మన్ననలు పొందిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తాజాగా “జూనియర్” సినిమాలోని “వైరల్ వయ్యారి” పాటతో మరోసారి తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. కొత్త హీరో కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ సినిమాలో.. ఈ మెలోడియస్ అండ్ మాస్ మిక్స్ చేసిన పాట హిట్ అయి, ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటకు రీల్స్ మోత మొదలైపోయింది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా వయ్యారి పాట ప్రతి ఫోన్‌లో వినిపిస్తోంది. డీఎస్పీ కంపోజ్ చేసిన మ్యూజిక్ మాత్రమే కాదు, క్యాచీ లిరిక్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. సంగీత ప్రవాహానికి తోడు, శ్రీలీల ఎక్స్‌ప్రెషన్స్, కిరీటి ఎనర్జీ పాటను మరింత ప్రత్యేకంగా మారుస్తున్నాయి.

ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే.. కొత్త హీరో కోసం డీఎస్పీ వేసిన సంగీతం ఇది. స్టార్ హీరో లేకపోయినా.. అలాంటి హై ఎనర్జీ సాంగ్ ఇవ్వగల శక్తి డీఎస్పీకే సాధ్యమవుతుంది. తను చేసే ప్రతీ పనిలోనూ డెడికేషన్, కష్టపడే పనితనం కనిపిస్తాయి. అందుకే చిన్న సినిమాగా స్టార్ట్ అయిన “జూనియర్” మూవీకి నేషనల్ లెవెల్ రిచ్ వచ్చింది.

ఇటీవల కాలంలో పుష్ప 2, తండేల్, కుబేరా సినిమాలకి సంగీతం అందించిన డీఎస్పీ.. ఇప్పుడు “జూనియర్” పాటతో మరో మ్యూజిక్ సంచలనం నమోదు చేశాడు. ఆయన్ని ఎందుకు హిట్ మెషీన్ అంటారో మరోసారి రుజువైంది. పాటలతో సినిమాల రేంజ్‌ను పెంచగల సత్తా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పకనే చెప్పాలి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాటకు డ్యాన్స్ చేసే సెలబ్రిటీలు, ఫ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక డీఎస్పీ చేసిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాలో హైలైట్ అయ్యే అవకాశం ఉంది. “కుబేరా” టీజర్‌లో వినిపించిన బీజీఎమ్ ఇప్పటికే ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే “వైరల్ వయ్యారి” పాట సినిమా రిలీజ్‌కి ముందు ఓ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

మొత్తానికి, డీఎస్పీ మాస్ అంటే మాస్, మెలోడి అంటే మెలోడి అన్నట్టుగా.. అన్ని జానర్లలోనూ విజయం సాధించగల మ్యూజిక్ బ్రహ్మ అని మరోసారి నిరూపితమైంది. స్టార్ హీరో లేకపోయినా, డీఎస్పీ ఉన్నాడంటే మ్యూజిక్‌కి మేజర్ బజ్ ఉంటుందని ఈ పాటతో తేలిపోయింది. ఇక “వైరల్ వయ్యారి” ఎంతలా సాంగ్‌ హిట్టయిందో.. సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా తెలుస్తుంది.