దేవి ఖాతాలో ఏవేమి ఉన్నాయంటే..?
ఇక ఈ ఇయర్ ప్రస్తుతానికి ధనుష్ తో కుబేర సినిమా ఒక్కటే చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా ది బెస్ట్ అనిపించుకునేలా చేస్తున్నారు.
By: Tupaki Desk | 28 May 2025 9:30 PMరాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లాస్ట్ ఇయర్ పుష్ప 2 సినిమాతో మరోసారి తన మ్యూజిక్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేశాడు. సుకుమార్ తో దేవి సినిమా అంటే అది మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్ కావాల్సిందే. వీరిద్దరి సింక్ అలా కుదిరింది. సుకుమార్ డైరెక్షన్ లో సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ మాత్రమే చేస్తాడు అని తెలిసిందే. పుష్ప 2 అలరించిన దేవి శ్రీ ప్రసాద్ అంతకుముందు సూర్య కంగువకి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు.
ఇక ఈ ఇయర్ ప్రస్తుతానికి ధనుష్ తో కుబేర సినిమా ఒక్కటే చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మ్యూజిక్ విషయంలో కూడా ది బెస్ట్ అనిపించుకునేలా చేస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ పరంగా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. దేవిని నమ్మి సినిమా చేతిలో పెడితే కచ్చితంగా దానికి 100 పర్సెంట్ న్యాయం చేస్తాడు. ఐతే కుబేర తో పాటు కన్నడ సినిమా జూనియర్ అనే మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్.
ఆ సినిమా కన్నడతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇదే కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి మ్యూజికల్ సెన్సేషన్ గా మారిందో తెలిసిందే. అందుకే దానికి ఏమాత్రం తగ్గకుండా ఉస్తాద్ మ్యూజిక్ ఉండేలా చూస్తున్నాడు.
కుబేర, కన్నడలో చేస్తున్న జూనియర్ తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 సినిమాలు మాత్రమే దేవి చేతిలో ఉన్నాయి. ఐతే మరో రెండు ప్రాజెక్ట్ లు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. తెలుగులో థమన్ ఈమధ్య కాస్త దూకుడు పెంచగా డీఎస్పీకి సినిమాలు తగ్గాయి. ఐతే పుష్ప 2 తో తిరిగి ఫాంలోకి వచ్చిన దేవి శ్రీ ప్రసాద్ మళ్లీ తన మ్యూజిక్ తో అదరగొట్టాలని చూస్తున్నాడు. రాబోతున్న సినిమాల్లో దేవి మ్యూజిక్ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో చూడాలి. తప్పకుండా డీఎస్పీ మార్క్ అందించేలా ఈ సినిమాల సంగీతం ఉండబోతుందని చెప్పొచ్చు.