సంఖ్య తగ్గినా మార్క్ మాత్రం పీక్స్ లో!
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంత బిజీగా ఉండేవాడో చెప్పాల్సిన పనిలేదు. అయితే మూడు నాలుగేళ్లగా అంత బిజీగా కనిపించలేదు.
By: Tupaki Desk | 23 Jun 2025 11:25 AM ISTరాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంత బిజీగా ఉండేవాడో చెప్పాల్సిన పనిలేదు. అయితే మూడు నాలుగేళ్లగా అంత బిజీగా కనిపించలేదు. అలాగని ఖాళీగానూ లేడు. కానీ తాను ఏ సినిమాకు పని చేసినా క్వాలిటీ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆ చిత్రాలు బ్లాక్ బస్టర్లు అవుతున్నాయి. దీంతో దేవి పేరు మార్కెట్ లో ప్రత్యేకంగా హైలైట్ అవ్వడం మొదలైంది. గత ఏడాది 'కంగువ',' రత్నం', 'పుష్ప2' చిత్రాలకు సంగీతం అందించాడు.
అందులో 'పుష్ప2' బ్లాక్ బస్టర్ అయింది. మిగతా రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో ఆ ప్రభావం దేవిపై పెద్దగా పడలేదు. సినిమా బాగుంటేనే సంగీతం ఎలా ఉన్నా ఆడేస్తుంది బొమ్మ. కానీ సినిమా పోయిన తర్వాత సంగీతం బాగున్నా? ఫలితమేమి. అలా దేవి ఆ రెండు పరాజయాల నుంచి బయట పడ్డాడు. చివరిగా రిలీజ్ అయింది 'పుష్ప2' కావడంతో కలిసొచ్చింది. ఆ తర్వాత 'తండేల్' తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
మరోసారి తన మార్క్ క్లాసిక్ సాంగ్స్ తో అలరించాడు. సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఇటీవలే రిలీజ్ అయిన 'కుబేర' కూడా బ్లాక్ బస్టర్ అయింది. మ్యూజిక్ పరంగానూదేవి సక్సెస్ అయ్యాడు. దీంతో రాక్ స్టార్ సక్సెస్ గ్రాఫ్ అంతకంతకు మరింత మెరుగు పడుతుంది. మంచి సంగీతం, ఆర్ ఆర్ తో సినీ ప్రియల్ని అలరిస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాల సంఖ్య తగ్గినా? తన మార్క్ మాత్రం ఎక్కడా మిస్ అవ్వలేదు.
