Begin typing your search above and press return to search.

దేవి కూడా ర‌ధ‌న్‌లా మారిపోతున్నాడా?

`అర్జున్‌రెడ్డి` సినిమా టైమ్‌లో ప్ర‌ధానంగా వార్త‌ల్లో నిలిచిన పేరు ర‌ధ‌న్‌. ఈ మూవీకి సంగీతం అందించిన ర‌ధ‌న్ పాట‌ల‌కు మ్యూజిక్ చేశాడు.

By:  Tupaki Desk   |   10 Jun 2025 4:55 AM
దేవి కూడా ర‌ధ‌న్‌లా మారిపోతున్నాడా?
X

`అర్జున్‌రెడ్డి` సినిమా టైమ్‌లో ప్ర‌ధానంగా వార్త‌ల్లో నిలిచిన పేరు ర‌ధ‌న్‌. ఈ మూవీకి సంగీతం అందించిన ర‌ధ‌న్ పాట‌ల‌కు మ్యూజిక్ చేశాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ అందించాడు. అయితే పాట‌ల విష‌యంలో త‌న‌ని ర‌ధ‌న్ టార్చ‌ర్ చేశాడ‌ని, అనుకున్న స‌మ‌యంలో పాట‌లు ఇవ్వ‌క‌పోవ‌డంతో తాను తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యాన‌ని ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగ బాహాటంగానే ర‌ధ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది.

అయితే ఈ విష‌యంలో సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ‌ప్ర‌సాద్ కూడా ర‌ధ‌న్‌ని ఫాలో అవుతున్నాడా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. దేవి సినిమాతో చిన్న వ‌య‌సులోనే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అరంగేట్రం చేసిన దేవి ఆ సినిమాతో అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసి పిల్లోడు కాదు పిడుగు అనిపించాడు. అదే జోష్‌తో సంగీత సామ్రాజ్యాన్ని ఏల‌డం మొద‌లు పెట్టాడు. అయితే రాను రాను అత‌ని సంగీతంలో మునుప‌టి జోష్ క‌నిపించ‌డం లేద‌నే కామెంట్‌లు మొద‌ల‌య్యాయి. కానీ అత‌ని నుంచి ఎలాంటి కామెంట్‌లు వినిపించ‌లేదు. నిర్మాత‌లు ఇన్నేళ్ల‌లో దేవి ఇబ్బంది పెడుతున్నాడ‌ని కామెంట్‌లు చేయ‌లేదు.

అయితే `పుష్ప 2` విష‌యంలో మాత్రం దేవి చేసిన త‌ప్పులు బ‌య‌ట‌ప‌డ్డాయి. సినిమాకు దేవి అందించిన నేప‌థ్య సంగీతం సుక్కూకు న‌చ్చ‌క‌పోవ‌డం, ఆల‌స్యం చేయ‌డం వంటి కార‌ణాల‌తో బ్యాగ్రౌండ్ స్కోర్‌ని సుకుమార్ త‌మ‌న్‌, సామ్ సీఎస్‌కు అప్ప‌గించ‌డం తెలిసిందే. దీనికి సంబంధించిన వివాదం కొన్ని రోజులు న‌డిచి సినిమా రిలీజ్ త‌రువాత స‌ద్దుమ‌నిగింది. అయితే తాజాగా ర‌ధ‌న్ త‌ర‌హాలోనే దేవి `కుబేర‌` టీమ్‌ను ఇబ్బంది పెడుతున్నాడ‌నే న్యూస్ బ‌య‌టికి రావ‌డంతో అంతా షాక్ అవుతున్నారు.

మ‌రో ప‌ది రోజుల్లో `కుబేర‌` రిలీజ్ కాబోతోంది. అయితే దేవి మ‌రో రెండు పాట‌ల‌కు సంబంధించిన మ్యూజిక్‌ని పూర్తి చేయ‌లేద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నిర్మాత సునీల్ నారంగ్ బ‌య‌ట‌పెట్ట‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు. ఈ సంద‌ర్భంగా దేవిని విమ‌ర్శించ‌క‌పోయినా లేట్ చేస్తున్నాడనే విష‌యం బ‌య‌ట‌పెట్ట‌డంతో దేవి ఇలా చేయ‌డం ఏంటీ? మ‌రో ప‌ది రోజుల్లో సినిమా రిలీజ్ ఉన్న నేప‌థ్యంలో రెండు పాట‌లు ఇంకా పూర్తి చేయ‌క‌పోవ‌డం ఏంటీ? అని అంతా షాక్ అవుతున్నారు. `కుబేర‌` ప్రాజెక్ట్‌ని ప్ర‌క‌టించి మూడేళ్ల‌వుతోంది. సినిమా సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ పూర్తి చేసి చాలా రోజులే అవుతోంది. ఇంత టైమ్ ఉన్నా దేవి పాట‌లు ఇవ్వ‌క‌పోవ‌డం చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఓ సినిమా ప్ర‌మోష‌న్స్ వైర‌ల్ అయ్యాయంటే దానికి ఆడియో ప్ర‌ధాన కార‌ణంగా నిలుస్తూ ఉంటుంది. కానీ దేవి కార‌ణంగా `కుబేర‌` ఆ ఛాన్స్ ని కోల్పోయింది. ఇది గ‌మ‌నించిన వారంతా దేవి ఏంటీ ర‌ధ‌న్‌లా మారిపోతున్నాడ‌ని కామెంట్‌లు చేస్తున్నారు.