Begin typing your search above and press return to search.

క్రియేట్‌ చేయడానికి, కాపీ కొట్టడానికి కాదు : దేవి శ్రీ ప్రసాద్‌

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన చిన్న వయసు నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 11:01 AM IST
క్రియేట్‌ చేయడానికి, కాపీ కొట్టడానికి కాదు : దేవి శ్రీ ప్రసాద్‌
X

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన చిన్న వయసు నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఆయన తండ్రి గుర్తింపుతో ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. సుదీర్ఘ కాలంగా సౌత్‌ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్‌ దర్శకుల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు. సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల్లో టాప్‌ 5 లో దేవి శ్రీ ప్రసాద్‌ ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఆయన పారితోషికం విషయమై కొందరు విమర్శలు చేసినా, తన పనికి తగ్గట్టుగా పారితోషికం తీసుకుంటాను అని సన్నిహితుల వద్ద దేవి శ్రీ ప్రసాద్‌ అంటూ ఉంటాడట.

దేవి శ్రీ ప్రసాద్‌ లో చాలా అరుదైన గుణం ఒకటి ఉంది. సంగీత దర్శకులు అంటే అన్ని రకాల పాటలు, బీజీఎంలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అప్పుడప్పుడు దర్శకుడి కోరిక మేరకు, సినిమా డిమాండ్‌ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో పాత పాటలను రీమిక్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. టాప్‌ మ్యూజిక్ డైరెక్ట్స్‌లో ఎంతో మంది సైతం రీమిక్స్ చేసిన విషయం తెల్సిందే. కానీ దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ఇప్పటి వరకు రీమిక్స్ అనేది చేయలేదు. కొన్ని సినిమాల్లో చేయాల్సి వస్తే మధ్యలో వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు ఆరంభంలోనే రీమిక్స్ ఉన్న కారణంగా వదిలేశాడు. రీమిక్స్ చేయడం ఇష్టం ఉండని దేవి శ్రీ ప్రసాద్‌ తాజాగా ఆ విషయమై చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దేవి శ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ... సినిమా ఇండస్ట్రీలో రీమిక్స్‌లు అనేవి చాలా కామన్‌, కానీ నేను మాత్రం రీమిక్స్ చేయకూడదని అనుకున్నాను. నాకు నేను ఈ విషయంలో నిబంధన పెట్టుకుని పని చేసుకుంటూ వచ్చాను. కొన్ని సార్లు సినిమాలు వదిలేయాల్సి వచ్చినా కూడా మొదటి నుంచి తాను పెట్టుకున్న నిబంధన మాత్రం వదిలేయలేదు. భవిష్యత్తులో కూడా నేను అదే నిబంధనతో సినిమాలు చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. సంగీత దర్శకుడు అనే వాడు కొత్త ట్యూన్స్‌ ను క్రియేట్‌ చేయాలి, అంతే కానీ ఉన్నదాన్ని కాపీ కొట్టి కొత్తగా రీ క్రియేట్‌ చేయకూడదు. అందుకే తాను రీ క్రియేషన్‌కి పూర్తిగా దూరంగా ఉంటాను. రీమిక్స్ చేయక పోవడం వల్ల చాలా పెద్ద ప్రాజెక్ట్‌లు చేజారినట్లు దేవి చెప్పుకొచ్చాడు.

రీమిక్స్‌లు చేయడం అనేది తప్పని తాను చెప్పడం లేదు, కానీ తాను మాత్రం ఆ పని చేయను అంటున్నాడు. ఇతరులు చేసే రీమిక్స్ ను తాను ఎప్పుడూ తప్పుబట్టను అన్నాడు. కొందరు చేసిన రీమిక్స్‌ పాటలను విని అభినందించిన సందర్భాలు ఉన్నాయని దేవి శ్రీ పేర్కొన్నాడు. రీమిక్స్‌ పాటలు బాగుంటే తప్పకుండా వేరే మ్యూజిక్‌ డైరెక్ట్స్‌ వి అయినా కూడా నేను వింటూ ఉంటాను. అజిత్‌ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్‌ అగ్లీ సినిమాలో పలు రీమిక్స్‌లు ఉన్న కారణంగా దేవి శ్రీ ప్రసాద్‌ తప్పుకున్నాడు. కానీ ఆ సమయంలో నిర్మాతలతో గొడవ కారణంగా దేవి శ్రీ తప్పుకున్నాడు అనే వార్తలు వచ్చాయి. అది నిజం కాదని దేవి శ్రీ ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.