రౌడీ స్టార్, నవీన్ పొలిశెట్టి సేమ్ టు సేమ్!
తన నుంచి సినిమా వచ్చి రెండేళ్లకు పైనే అవుతోంది. ప్రస్తుతం 'అనగనగ ఒక రాజు'లో నటిస్తున్నా అది ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
By: Tupaki Desk | 19 Jun 2025 2:00 PM ISTరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'అర్జున్‌రెడ్డి' తరువాత ఏ స్థాయి క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడో తెలిసిందే. యూత్‌లో రికార్డు స్థాయి పాపులారిటీని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ వరకు అదే ఊపుని కొనసాగించాడు. అయితే పూరీని అతిగా నమ్మి చేసిన 'లైగర్' ఆ క్రేజ్‌ని చాలా వరకు జీరో చేసేసింది. ఈ సినిమాతో భారీ డిజాస్టర్ ఎదుర్కోవడంతో విజయ్ దేవరకొండ చాలా వరకు సైలెంట్ అయిపోయాడు.
అప్పటి వరకు తన ప్రతి మూవీ ఈవెంట్‌లో 'వాట్సాప్ వాట్సాప్ రౌడీ బాయ్స్' అంటూ ఫ్యాన్స్‌ని హోరెత్తించిన విజయ్‌లో 'లైగర్' డిజాస్టర్ తరువాత చాలా వరకు ఆ జోష్, సినిమాల విషయంలో స్పీడు మిస్సవుతూ వస్తోంది. కుషీ, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా కానీ రౌడీ మార్కు స్పార్క్ ఎక్కడా కనిపించలేదు. దీనికి తోడు విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ 'కింగ్‌డమ్' రిలీజ్ రోజు రోజుకీ ఆలస్యం అవుతుండటంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత కొంత కాలంగా తన మార్కు బ్లాక్ బస్టర్‌ని సొంత చేసుకోలేకపోతున్న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్'తో బ్లాక్ బస్టర్‌ని సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే తరహాలో సందడి చేసిన సైలెంట్ అయిన మరో యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. 'జాతిరత్నాలు' సినిమాతో రికార్డు స్థాయి విజయాన్ని సొంత చేసుకోవడమే కాకుండా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచిన నవీన్ 'మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి' తరువాత బాగా సైలెంట్ అయిపోయాడు.
తన నుంచి సినిమా వచ్చి రెండేళ్లకు పైనే అవుతోంది. ప్రస్తుతం 'అనగనగ ఒక రాజు'లో నటిస్తున్నా అది ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చే ఏడాది ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంటే దాదాపు మూడేళ్లుగా ఈ హీరో ప్రేక్షకులకు దూరమయ్యాడన్నమాట. ఉన్పనట్టుండి నవీన్ ఇంత సైలెంట్ కావడానికి కారణం ఏంటనే ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. నవీన్ చేయి ఫ్రాక్ఛర్ కావడంతో సినిమా షూటింగ్ మరింతగా ఆలస్యం అయింది. దీంతో ఈ ఏడాది కూడా అతని సినిమా థియేటర్లకు రావడం లేదు. ఇలా విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి ఒకే తరహాలో సైలెంట్ కావడంతో అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు.
