Begin typing your search above and press return to search.

సెట్స్ లోనే మృణాల్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన దేవరకొండ!

ఈ రోజు అంటే ఆగస్టు 1వ తేదీన మృణాల్ పుట్టిన రోజు. దీంతో, షూటింగ్ స్పాట్ లోనే సర్ ప్రైజ్ ఇస్తూ మృణాల్ తో కేక్ కట్ చేయించారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 1:24 PM GMT
సెట్స్ లోనే మృణాల్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన దేవరకొండ!
X

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు మృణాల్ ప్రయత్నిస్తోంది. ఈ బ్యూటీ సీతారామం మూవీతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ మూవీ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఓ వైపు నానితో హే నాన్న మూవీలో నటిస్తోంది. మరో వైపు విజయ్ దేవరకొండ సినిమాలోనూ లీడ్ రోల్ చేస్తోంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల దర్శకుడు పరశురామ్ తో ఓ సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు చేసి, లాంఛనంగా మూవీ షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ మూవీలో విజయ్ సరసన మృణాల్ ని ఎంపిక చేశారు.

కాగా, ఈ మూవీ టీమ్ ఇటీవల షూటింగ్ మొదలుపెట్టింది. ఇప్పటికే షూటింగ్ కి సంబంధించిన లొకేషన్స్ మూవీ టీమ్ వెతికేసింది. అయితే, షూటింగ్ లో భాగంగా మృణాల్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ రోజు అంటే ఆగస్టు 1వ తేదీన మృణాల్ పుట్టిన రోజు. దీంతో, షూటింగ్ స్పాట్ లోనే సర్ ప్రైజ్ ఇస్తూ మృణాల్ తో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ ఫోటోల్లో విజయ్ లుక్ బాగుంది. విజయ్, మృణాల్ తో పాటు, డైరెక్టర్ పరశురామ్, నిర్మాత దిల్ రాజు కుమార్తె కూడా ఉన్నారు. కాగా, ఈ మూవీకి ఫ్యామిలీ స్టార్ అనే పేరు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ టాక్. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కాగా, గతంలో విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. గీతాగోవిందంలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించింది.

ఇదిలా ఉండగా, విజయ్ దేవరకొండ ఈ ప్రాజెక్ట్‌తో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన అతని రాబోయే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఖుషి సినిమా సెప్టెంబర్1, 2023న విడుదల కానుంది. విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తోంది.