Begin typing your search above and press return to search.

1000 కోట్ల టార్గెట్ తో దేవర.. ప్లాన్ అదుర్స్..!

అయితే తారక్ తో చేసే కథతో మరోసారి తన పవర్ ఏంటన్నది చూపించాలని రెడీ అవుతున్నాడు.

By:  Tupaki Desk   |   18 Jan 2024 11:30 PM GMT
1000 కోట్ల టార్గెట్ తో దేవర.. ప్లాన్ అదుర్స్..!
X

RRR తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాన్ ఆఫ్ మాసెస్ అవతారం ఎత్తాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా తో మరోసారి బాక్సాఫీస్ పై టైగర్ పంజా విసరనున్నాడు. ఈ సినిమా విషయంలో ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. యువ సుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న దేవర సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించారు.

ఆచార్య ఫ్లాప్ తో కొరటాల శివ కెరీర్ లో బ్యాడ్ ఫేస్ ఎదుర్కొన్నాడు. అయితే తారక్ తో చేసే కథతో మరోసారి తన పవర్ ఏంటన్నది చూపించాలని రెడీ అవుతున్నాడు. దేవర సినిమా ప్రతి యాస్పెక్ట్ లో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. సినిమా రషెస్ తోనే బ్లాక్ బస్టర్ వైబ్ వస్తుందని తెలుస్తుంది. సెట్స్ మీద ఉన్న ఈ సినిమా బిజినెస్ విషయంలో కూడా అదరగొట్టేస్తుంది. ఆల్రెడీ సినిమా డిజిటల్ రైట్స్ 150 కోట్ల పైన డీల్ సెట్ అయినట్టు తెలుస్తుంది.

థియేట్రికల్, ఆడియో రైట్స్ లో కూడా దేవర అదరగొట్టేస్తున్నాడని తెలుస్తుంది. అంతకుముందు ఏమో కానీ ట్రిపుల్ R తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఎన్.టి.ఆర్ ఆ వెంటనే వస్తున్న సినిమాగా దేవర మీద విపరీతమైన బజ్ ఏర్పడింది. అందుకే సినిమా ప్రతి విషయంలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ జరుగుతున్నాయి. ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ తో కలిసి 1000 కోట్ల మార్క్ టచ్ చేసిన ఎన్.టి.ఆర్ ఈసారి సోలోగా ఆ మార్క్ రీచ్ అవ్వాలని చూస్తున్నాడు.

ఎన్.టి.ఆర్, కొరటాల శివ ఇదివరకు జనతా గ్యారేజ్ సినిమా చేశారు. ఈసారి ఇద్దరు కలిసి దేవర గా రాబోతున్నారు. ముందు ఒక సినిమాగా అనుకున్న దేవర ఇప్పుడు రెండు భాగాలుగా చేస్తున్నారు. కచ్చితంగా దేవర సినిమా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ పెడుతుందని అంటున్నారు. దేవర అనుకున్నట్టుగా 1000 కోట్లు కొడితే మాత్రం తెలుగులో నాన్ రాజమౌళి సినిమాతో తారక్ ఒక్కడే ఆ ఫీట్ సాధించిన వాడుగా రికార్డ్ సృష్టిస్తాడు.

దేవర సినిమాలో ఎన్.టి.ఆర్ తో శ్రీదేవి తనయ జాన్వి కపూర్ జోడీ కడుతుంది. ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా మరో హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ క్రేజీ కాంబోలో వస్తున్న దేవర బాక్సాఫీస్ దగ్గర మోత మోగించేయడం పక్కా అని ఫిక్స్ అయ్యారు తారక్ ఫ్యాన్స్.