Begin typing your search above and press return to search.

'దేవర'.. టైగర్ ఉండాల్సిందే..

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'

By:  Tupaki Desk   |   27 Dec 2023 11:03 AM GMT
దేవర.. టైగర్ ఉండాల్సిందే..
X

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి వచ్చే నెలలో టీజర్ రాబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ దేవర టీజర్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రెండు రోజుల నుంచి 'దేవర' సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

అందుకు కారణం ఒకరు కళ్యాణ్ రామ్ అయితే మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్. కళ్యాణ్ రామ్ ఈనెల 29న 'డెవిల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఇందులో డెవిల్ మూవీ తో పాటు దేవర సినిమా గురించి కూడా ఆసక్తికర అప్డేట్స్ పంచుకున్నారు.

దేవర దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని, ప్రస్తుతం VFX పనులు జరుగుతున్నాయని, త్వరలోనే గ్లింప్స్ ని రిలీజ్ చేయబోతున్నామని, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటివరకు రాని ఓ భారీ విజువల్ ట్రీట్ ని దేవర తో ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నట్లు చెప్పారు. ఇక కళ్యాణ్ రామ్ తర్వాత వెంటనే కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తన ట్విట్టర్ ద్వారా దేవర టీజర్ గురించి ట్వీట్ చేశాడు. ఇక టైగర్ ప్రస్తావన లేకుండా తారక్ సినిమాలు ఉండవని మరోసారి అర్ధమవుతుంది.

దేవర టీజర్ కోసం ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నానని చెప్పిన అనిరుద్ తన ట్వీట్ లో #AllHailTheTiger అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేసాడు. ఈ ఒక్క హ్యాష్ ట్యాగ్ తో దేవరపై హై ఎలివేషన్స్ ఇస్తూ టీజర్ పై మరింత హైప్ పెంచేశాడు అనిరుధ్. దీంతో ప్రస్తుతం తారక్ ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో #AllHailTheTiger హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో తెగ ట్రెండ్ అవుతుంది.

మరోవైపు ఈమధ్య అగ్ర హీరోల సినిమాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేస్తున్న అనిరుద్ దేవర టీజర్ కి ఏ రేంజ్ లో బీజీయం ఇచ్చాడోనని ఫ్యాన్స్ అంతా దేవర టీజర్ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. అనిరుద్ ట్వీట్ ని బట్టి చూస్తే ఇప్పటికే టీజర్ కి సంబంధించిన రీ రికార్డింగ్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక జనవరి 8న దేవర టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు.