Begin typing your search above and press return to search.

దేవర : హీరోయిన్‌ రోల్‌ రూమర్స్‌.. క్లారిటీ..!

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాపై పాన్‌ ఇండియా రేంజ్ లో అంచనాలు భారీగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   22 Jan 2024 9:42 AM GMT
దేవర : హీరోయిన్‌ రోల్‌ రూమర్స్‌.. క్లారిటీ..!
X

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాపై పాన్‌ ఇండియా రేంజ్ లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. అందుకు తగ్గట్లుగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ భారీ యాక్షన్ ఎంటర్‌ టైనర్ గా రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి సినిమాలో మినహా మరే సినిమాలో కూడా హీరోయిన్స్ కు పెద్దగా ప్రాముఖ్యత లేదు. కనుక దేవర సినిమాలో కూడా జాన్వీ కపూర్‌ పాత్ర గురించి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు అనే టాక్‌ వినిపించింది.

తాజాగా హీరోయిన్‌ పాత్ర గురించి జరుగుతున్న ప్రచారం పై చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. కథ లో అత్యంత కీలకమైన పాత్రలో జాన్వీ కపూర్ కనిపించబోతుంది. సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ లో జాన్వీ ఉంటుంది అంటూ మేకర్స్ నుంచి ఒక అనధికారిక లీడ్ బయటకు వచ్చింది.

జాన్వీ కపూర్ ఇన్నాళ్లు కమర్షియల్‌ హిట్స్ ను అందుకోలేక పోయింది. దేవర సినిమాతో ఆమెకు కమర్షియల్‌ గా బిగ్గెస్ట్‌ సక్సెస్ దక్కడంతో పాటు, నటనకు కూడా మంచి ఆస్కారం ఉన్న పాత్ర చేస్తున్న కారణంగా నటిగా కూడా జాన్వీ కపూర్ కి ఒక మంచి సినిమాగా దేవర నిలుస్తుందనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. మరి వారు చెప్పినట్లుగా దేవరలో జాన్వీకి అంత ప్రాముఖ్యత ఉంటుందా అనేది తెలియాలి అంటే ఏప్రిల్‌ లో సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్‌ చేయాల్సిందే.