Begin typing your search above and press return to search.

గోవాలో రొమాంటిక్ జర్నీ మొదలు పెట్టిన 'దేవర

12 నుంచి 15 రోజుల పాటు గోవా షెడ్యూల్‌ ను దర్శకుడు కొరటాల శివ ప్లాన్‌ చేసినట్లుగా యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 6:49 AM GMT
గోవాలో రొమాంటిక్ జర్నీ మొదలు పెట్టిన దేవర
X

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'దేవర' సినిమా రెగ్యులర్ షూటింగ్ చిన్న చిన్న బ్రేక్‌ లతో ఫుల్ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం గోవా లో కీలమైన హీరో, హీరోయిన్‌ సన్నివేశాలను చిత్రీకరించేందుకు రెడీ అయ్యాడు.

దసరా సందడి పూర్తి అయిన వెంటనే దేవర టీమ్ గోవా వెళ్లారు. అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అవ్వడంతో షూటింగ్ మొదలు అయింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో పాటు కీలక నటీ నటులు ఈ షెడ్యూల్‌ లో కనిపించబోతున్నారు. 12 నుంచి 15 రోజుల పాటు గోవా షెడ్యూల్‌ ను దర్శకుడు కొరటాల శివ ప్లాన్‌ చేసినట్లుగా యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ఇంతకు ముందే 'దేవర' షూట్‌ లో పాల్గొంది. ఇంతకు ముందు చిత్రీకరించిన సన్నివేశాలతో పోల్చితే ఈ సారి రొమాంటిక్ టచ్ ఉన్న సన్నివేశాల చిత్రీకరణ ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ ల యొక్క కలయిక లో దేవర సినిమా లో రొమాన్స్ అదిరి పోవడం ఖాయం అన్నట్లుగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

మొన్నటి వరకు హైదరాబాద్‌ లోనే కీలక యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ తో కలిసి ఎన్టీఆర్ ఆ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నాడు. దేవర సినిమా ను రెండు పార్ట్‌ లు గా విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు కొరటాల శివ ప్రకటించడం తో భారీ యాక్షన్‌ తో పాటు ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల రొమాంటిక్ జర్నీ ని రెండు భాగాల్లో చూసే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.