Begin typing your search above and press return to search.

దేవర.. ఆరంభం ఎలా ఉండబోతోంది?

తాజాగా మరోసారి ఇంటరెస్టింగ్ విజువల్ ని గ్లింప్స్ ఎలా ఉండబోతోంది అనేది తెలియడం కోసం శాంపిల్ గా వదిలారు. రక్తంతో తడిచిన సముద్రాన్ని ఈ గ్లింప్స్ లో చూడబోతున్నారు అని ఈ విజువల్ బయట్టి అర్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   7 Jan 2024 3:46 AM GMT
దేవర.. ఆరంభం ఎలా ఉండబోతోంది?
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కంప్లీట్ ఫిక్షనల్ ప్రపంచాన్ని ఈ కథ కోసం కొరటాల సృష్టించాడు. ఒక ఐలాండ్ నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.

ఇదిలా ఉంటే సంక్రాంతి కానుకగా దేవర నుంచి అదిరిపోయే గ్లింప్స్ అందించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కచ్చితంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. యంగ్ టైగర్ ఫ్యాన్స్ దేవర ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా దేవర సినిమాపై కళ్యాణ్ రామ్ కొన్ని అప్డేట్స్ ఇచ్చారు.

ఈ మూవీ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందని చెప్పారు. ముఖ్యంగా సముద్రంపై వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ చాలా పవర్ ఫుల్ గా గూస్ బాంబ్స్ తెప్పిస్తాయని అన్నారు. మూవీకి సంబందించిన అప్డేట్ రాబోతుందని కూడా క్లారిటీ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ కన్ఫర్మ్ చేసిన వెంటనే దేవర గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. జనవరి 8న 4:04 గంటలకి గ్లింప్స్ లాంచింగ్ ఉంటుందని చెప్పారు.

తాజాగా మరోసారి ఇంటరెస్టింగ్ విజువల్ ని గ్లింప్స్ ఎలా ఉండబోతోంది అనేది తెలియడం కోసం శాంపిల్ గా వదిలారు. రక్తంతో తడిచిన సముద్రాన్ని ఈ గ్లింప్స్ లో చూడబోతున్నారు అని ఈ విజువల్ బయట్టి అర్ధమవుతోంది. మరి గ్రాండ్ స్కేల్ పై తెరకెక్కుతోన్న దేవర గ్లింప్స్ ఎలా ఉండబోతోంది అనేది అందరిలో కూడా ఆసక్తికర అంశంగా ఉంది.

ఇదిలా ఉంటే దేవర గురించి తాజాగా జాన్వీ కపూర్ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాక్టర్ గా తన నిజమైన కెరియర్ దేవర మూవీతోనే స్టార్ట్ అవుతుందని, ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ కూడా జస్ట్ రిహార్శల్స్, వర్క్ షాప్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఆమె మాటల బట్టి మూవీలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎంత బలంగా ఉండబోతోంది అనేది అర్ధం అవుతోంది.