Begin typing your search above and press return to search.

గ్లింప్స్: ‘దేవర’ ఊచకోతకు ఎరుపెక్కిన సముద్రం

జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 11:25 AM GMT
గ్లింప్స్: ‘దేవర’ ఊచకోతకు ఎరుపెక్కిన సముద్రం
X

జూనియర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సమ్మర్ లో రానుంది. ఇక ఫస్ట్ గ్లింప్స్ విడుదల కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక మొత్తానికి ఆ సమయం రానే వచ్చింది. ‘దేవర’తో మాస్ క్యారెక్టర్ తో ఎన్టీఆర్ తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.


‘దేవర’ ఫస్ట్ సన్నివేశాలను చూస్తుంటే సినిమా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో రూపొందుతోందని తెలుస్తోంది. సముద్రం, ఓడలతో పాటు రక్తంతో నిండిన ప్రపంచాన్ని హైలెట్ చేశారు. నెవ్వర్ బిఫోర్ అనేలా మాస్ అవతార్‌ లో ‘దేవర’గా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఇక ఫస్ట్ లుక్ తోనే ఒక రేంజ్ లో ఆకట్టుకున్న దేవర ఇప్పుడు ఈ మినీ టీజర్ తో మరింత హైప్ తెస్తున్నాడు.

రక్తంతో తడిసిన D ఆకారంలోని ఆయుధాన్ని ఎన్టీఆర్ శుభ్రం చేస్తూ.. 'ఈ సముద్రం చేపల కంటే రక్తాన్నే ఎక్కువగా చూసింది అందుకనే దీన్ని ఎర్ర సముద్రం అంటారు.. అంటూ తన పవర్‌ఫుల్ వాయిస్‌తో చెప్పటం చూస్తుంటే గూజ్ బమ్స్ రావటం పక్కా అనిపిస్తుంది. ఇక దానికి తోడు అనిరుద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరింత హైలెట్ అయ్యింది.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్‌ గా నటిస్తోంది. మరో బాలీవుడ్ స్టార్ సైప్ అలీ ఖాన్ విలన్ పాత్రలో అలరించబోతున్నారు.

డైరెక్టర్ కొరటాల శివ దేవర సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా భారీ విజువల్స్ తో తెరపైకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దేవర చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 5న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. మరి అంచనాలకు తగ్గట్టుగా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.