Begin typing your search above and press return to search.

దేవర : పార్ట్‌ 1 లో విలన్‌, పార్ట్‌ 2 లో హీరోయిన్‌

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా లో జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   30 Oct 2023 10:30 AM GMT
దేవర : పార్ట్‌ 1 లో విలన్‌, పార్ట్‌ 2 లో హీరోయిన్‌
X

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా లో జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో జాన్వీ పాత్ర గురించి మొదటి నుంచి కూడా పలు రకాల పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. మొదట ఈ సినిమాలో జాన్వీ కపూర్ ను మత్యకారుల ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా చూపించబోతున్నారని, ఆ తర్వాత ఆఫీసర్ గా జాన్వీ కనిపించబోతుందనే వార్తలు వచ్చాయి.

తాజాగా దేవర సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర గురించి మరింత ఆసక్తికర చర్చ మొదలు అయింది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ దేవర సినిమాను రెండు పార్ట్‌ లుగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. సినిమా కథ రీత్యా రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అంటూ కొరటాల శివ తెలియజేసిన విషయం తెల్సిందే.

దేవర సినిమా రెండు భాగాల్లోనే రెండు విభిన్నమైన పాత్రలతో జాన్వీ కపూర్‌ కనిపించబోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దేవర మొదటి భాగం లో జాన్వీ కపూర్ నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది. కథ మొత్తం కూడా ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుందట.

ఇక రెండో భాగం లో జాన్వీ కపూర్ ను పాజిటివ్ గా చూస్తామట. అంటే మొదటి భాగం లో విలన్ గా కనిపించే జాన్వీ కపూర్ ను రెండో భాగం లో హీరోయిన్‌ గా చూడబోతున్నామన్నమట. ఈ విషయం గురించి సినిమా యూనిట్‌ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేదు.. కానీ ఫ్యాన్స్ లో మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతోంది.